1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Renu Desai Powerful Speech at Srimathi Pre-Release Event

అలాంటి భర్త ఉండాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది : రేణూ దేశాయ్ (Video)

renu desai
విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో రూపొందిన 'శ్రీమతి' చిత్రంలోని భర్త లాంటి వ్యక్తి ప్రతి ఒక్క అమ్మాయి తన భర్తగా ఉండాలని కోరుకుంటుందని ప్రముఖ నటి రేణూ దేశాయ్ అన్నారు. నివేదా థామస్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన 'శ్రీమతి' చిత్రంలో రేణూ దేశాయ్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు. డిసెంబరు 4వ తేదీన నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. 
 
ఇందులో రేణూ దేశాయ్ మాట్లాడుతూ, అమ్మాయిలకు ఊహ తెలిసినప్పటి నుంచి ఫలానా వారి కూతురు. ఫలానా వారి భార్య. ఫలానా వారి తల్లి అనే గుర్తింపు ఉంటుంది. ఇందులో తప్పులేదు. కానీ, తనకంటూ ఒక గుర్తింపు ఉండాలి అని ఏ అమ్మాయికైనా ఉంటుంది. ఈ అంశాన్ని చర్చించే సినిమానే 'శ్రీమతి'. హీరో తిరువీర్‌ను ఈ చిత్రంలో చూపించినదానికి, నిజ జీవితంలో ఉండే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇందులో భర్త తన భార్యకు సపోర్టివ్‌గా ఉంటాడు. అందరికీ ఇలాంటి భర్త ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. అందుకే ఇలాంటి సినిమా తప్పకుండా ప్రతి భాషలో రిమేక్ కావాలి. ప్రతి ఒక్కరూ విధిగా చూడాలి అని ఆమె పేర్కొన్నారు. 
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆటో జానీ గుర్తున్నాడా... ఈ సంక్రాంతికి మీ ముందుకు వస్తున్నాడు...