1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Satyadev's Samavarthi teaser creates a buzz, clocking 10 million views

Satyadev: కోటి వ్యూస్ తో క్రేజ్ పెంచేసిన సత్యదేవ్ సమవర్తి టీజర్

Samavarthi teaser hits 10 million views
Samavarthi teaser hits 10 million views
సత్యదేవ్ హీరోగా "సమవర్తి" అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. "సమవర్తి" సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి  జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
 
రీసెంట్ గా రిలీజ్ చేసిన "సమవర్తి" టీజర్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ టీజర్ కు ఇప్పటిదాకా కోటికి పైగా డిజిటల్ వ్యూస్ దక్కాయి. "సమవర్తి" టీజర్ బిజినెస్ సర్కిల్స్ లో మూవీపై క్రేజ్ పెంచేసింది. ఈ సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయి. టీజర్ లో పరిచయం చేసిన "సమవర్తి" ప్రపంచం  ప్రతి ఒక్కరినీ మెస్మరైజ్ చేస్తోంది. సత్యదేవ్ కెరీర్ లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందనే అంచనాలు టీజర్ తోనే ఏర్పడ్డాయి. మేకర్స్ ఈ చిత్రాన్ని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరిన్ని ఎగ్జైటింగ్ అప్డేట్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు "సమవర్తి" టీమ్ సన్నద్ధమవుతోంది.
 
నటీనటులు - సత్యదేవ్, శ్రీకాంత్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గానవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, తదితరులు
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Roshan: రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ చిత్రం ఎమో ఎమో ఇది.. టైటిల్ సాంగ్