Astrology Weekly Horoscope Details

Notifications

మకరం మకరం
మకరం: ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు అన్ని విధాలా బాగుంటుంది. లక్ష్యానికి చేరువవుతారు. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు వేసుకుంటారు. మీ ప్రణాళికలు ఫలిస్తాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. సమయంలో చెల్లింపులు జరుపుతారు. పనులు చురుకుగా సాగుతాయి. భార్యాభర్తల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగ కార్యక్రమాలు యథావిధిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి.

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దుమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. దూరపు బంధువుల శుభలేఖ అందుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవదీక్ష స్వీకరిస్తారు.

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమేదీపావళి పండుగ రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం వంటి అద్భుత యోగాలు ఏర్పడనున్నాయి. ఎంతో శుభ ఫలాలను అందించగల యోగాల వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం తదితర రాశుల జీవితంలో అదృష్టం, అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. దీపావళి పండుగలో ఏర్పడే గ్రహ యోగాల వల్ల ఈ ఏడాది వివిధ యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం స్వాతి నక్షత్రంతో పాటు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా తులా రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు అనే గ్రహాలు, సింహ రాశిలో గురువు, కేతువు, కుజుడు అనే గ్రహాలు కలిసి సంచారం చేస్తున్నాయి. బుధుడు, శుక్రుడి స్థితి వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇలాంటి అద్భుత యోగాలు దీపావళి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి.