Astrology Monthly Horoscope

Notifications

తేదీని ఎంచుకోండి
మేషం మేషం
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ

మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్క చేసుకుంటారు. అంతా అనుకూలంగా ఫలిస్తుంది. ఖర్చులు అధికమైనా ప్రయోజనకరంగా ఉంటాయి. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు....

more
వృషభం వృషభం
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో

వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ మాసం అన్ని విధాలా యోగదాయకం. దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తులవుతారు. స్థిరాస్తి, ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త....

more
మిథునం మిథునం
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ

మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. అర్హులకు సాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్లాన్‌లో సవరణలు సాధ్యమవుతాయి.....

more
కర్కాటకం కర్కాటకం
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో

కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష కార్యసిద్ధి, ధనలాభం ఉన్నాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. యత్నాలను సన్నిహితులు ప్రోత్సహిస్తారు. ఆదాయానికి తగ్గట్టుగా బడ్జెట్ చేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. పనులు చురుకుగా సాగుతాయి. అందరితోనూ మితంగా సంభాషించండి.....

more
సింహం సింహం
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే

సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఈ మాసం ప్రథమార్థం ఏమంత అనుకూలం కాదు. సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. ఖర్చులు విపరీతం, రుణాలు చేయాల్సి వస్తుంది. చేసిన పనులే మళ్లీ చేయవలసి వస్తుంది. ప్రతి విషయంలోనూ ఓర్పుతో శ్రమించాలి. స్వయం కృషి ఫలితాన్నిస్తుంది.....

more
కన్య కన్య
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో

కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. మీ కష్టం వృధా కాదు. పురోగతి లేదని నిరుత్సాహానికి లోనవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. ఆదాయానికి....

more
తుల తుల
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే

తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు ప్రతికూలతలు అధికం. ఆలోచనలతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపైనా ఆసక్తి ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా....

more
వృశ్చికం వృశ్చికం
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ

వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు మీ పని రంగంలో పురోభివృద్ధి చెందుతారు, అనుభవం గడిస్తారు. మీ మాట నేరుగా చెల్లుబాటవుతుంది. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు ప్రయోజనకరం. ఆలయాలు,....

more
ధనస్సు ధనస్సు
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా

ధనస్సు: మూల, పూర్వాషాడ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం ఈ మాసం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ఉంటారు. వ్యవహారాల్లో నిలదొక్కుకుంటారు. ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా....

more
మకరం మకరం
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ

మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు మీ ఓర్పు, నేర్పులకు పరీక్షా సమయం. ఆచితూచి అడుగు ముందుకు వేయండి. తొందరపాటు చర్యలు తగవు. అందరితోనూ మితంగా సంభాషించండి. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. ఆదాయానికి....

more
కుంభం కుంభం
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద

కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ మాసం ప్రతికూలతలు అధికం. వ్యవహారాల్లో తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణుల సలహా పాటించండి. పనులు పూర్తి కావస్తున్న సమయంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆదాయం అంతంత....

more
మీనం మీనం
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి

మీనం: పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి కార్యసిద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒత్తిడి, పనిభారం, అకాల భోజనం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఖర్చులు అధికమైనా సంతృప్తికరం. కొత్త పనులు చేపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు.....

more

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అందరితో మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను తప్పుపట్టే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?సెప్టెంబర్ 15 నుండి 23 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతుండగా, వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. నేడు మనం చూస్తున్న ఊరేగింపులు, వాహన సేవలు, ఆచారాలు, వివిధ కాలాల్లోని పాలకులు, ఆలయ నిర్వాహకులు, భక్తుల ద్వారా శతాబ్దాలుగా జరిగిన మార్పులు, చేర్పుల ఫలితమే. పురాణాల ప్రకారం, శ్రీనివాస స్వామి వెంకటాచలంపై ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించారు. అందుకే దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. అయితే, ఈ ఉత్సవం శతాబ్దాల కాలక్రమంలో పరిణామం చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.