Astrology Weekly Horoscope Details

Notifications

మిథునం మిథునం
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు మీ సహనమే మీకు శ్రీ రామ రక్ష. ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్నీ సమస్య అనుకోవద్దు ప్రతికూలతలు నిదానంగా తొలగుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. మంగళవారం వారు పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి. ధనం మితంగా వ్యయం చేయండి. పునుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సన్నిహితులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ప్రియతముల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం జాగ్రత్త, సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుటపడతారు. స్థిరాస్తి వ్యవహారంలో మెలకువ వహించండి. తొందరపాటు నిర్ణయం వల్ల నష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విధుల పట్ల అలక్ష్యం తగదు. అధికారులకు హోదా మార్పు.

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణం

ముంబైలో మళ్లీ కరోనా కేసులు.. రుతుపవనాలు లేటు కావడమే కారణందేశ ఆర్థిక రాజధాని ముంబైలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నగరంలో కోవిడ్-19, స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1), ఇన్‌ఫ్లుయెంజా వంటి ప్రమాదకర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ముంబైలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగుల రాకతో నిండిపోతున్నాయి. తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, ఎడతెరిపి లేని దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలతో వందలాది మంది ప్రజలు ప్రతిరోజూ వైద్యులను ఆశ్రయిస్తున్నారు. గత నెల రోజులుగా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవగా, గత వారం రోజులుగా కోవిడ్ పాజిటివ్ కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయని ముంబై వైద్యులు వెల్లడించారు.

సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌లో లీకైన అమ్మోనియా.. 67మంది కార్మికులకు ఏమైంది?

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదు

21-06-2026 నుంచి 27-06-2026 వరకు వార ఫలితాలు - మీ మాటకు తిరుగుండదుమేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కార్యసిద్ధి, వ్యవహారానుకూలత ఉన్నాయి. మాట నిలబెట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు దిశగా ఆలోచిస్తారు. రియల్ ఎస్టేట్ మధ్యవర్తులతో జాగ్రత్త. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి. తొందరపాటు నిర్ణయం తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. శుక్రవారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మొండి ధైర్యంతో ముందుకు సాగుతారు. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సంతానానికి శుభపరిణామాలున్నాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం.

20-06-2026 శనివారం ఫలితాలు.. కొత్తవారిని నమ్మవద్దు..

తిరుమల శ్రీవారి గడ్డానికి పచ్చకర్పూరం ఎందుకు రాస్తారు?