Astrology Yearly Horoscope Details

Notifications

ధనస్సు ధనస్సు
ధనుస్సు : మూల 1 2 34, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము ఆదాయం - 14 వ్యయం 11 - రాజపూజ్యం - 5 అవమానం- 6 ఈ రాశివారి గోచారం పరిశీలించగా వీరిపై అర్దాష్టమ శని ప్రభావం అంతగా ఉండదు. ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. మీదైన రంగంలో పురోభివృద్ధి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ప్రతి విషయంలోను ఆత్మస్థైర్యంతో ముందుకెళతారు. అందుకు తగ్గట్టుగా పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు భారమనిపించవు. అవసరాలకు ఏదో విధంగా ధనం అందుతుంది. వాహనం, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. నోటీసులు అందుకుంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగివస్తుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంస్థలు, పరిశ్రమల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. తాహతుకు మించి హామీలివ్వవదు. దంపతుల మధ్య కలహాలు తలెత్తినా వెంటనే సమసిపోతాయి. నిత్యం సన్నిహితులు, ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. గృహ నిర్మాణం ముగింపు దశకు చేరుకుంటాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. సంతానానికి శుభఫలితాలున్నాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలు ఎదురైనా వెంటనే తగ్గిపోగలవు. ఉద్యోగస్తులకు పదోన్నతి. ఉపాధ్యాయులకు స్థానచలనం ఇబ్బంది కలిగిస్తుంది. రిటైర్డు ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఆలస్యంగా అందుతాయి. అధికారులకు హోదామార్పు, కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ముఖ్యంగా న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. న్యాయవాదులు అన్ని కేసులను గెలుస్తారు. రాజీమార్గంలో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. వసాయ రంగాల వారికి అన్ని విధాలా అనుకూలమే. ఆశించిన పంట దిగుబడి సాధిస్తారు. ప్రకృతిపరంగా కూడా అనుకూలం. సాధించిన పంట దిగుబడి మంచి ధర లభిస్తుంది. కూరగాయలు, పండ్లు, పూలు సాగుచేయు రైతుల ఆదాయం బాగుంటుంది. విద్యాపరంగా విద్యార్థులకు ఓర్పు, ఏకాగ్రత ముఖ్యం. మంచి ఫలితాలు, ర్యాంకు సాధించటానికివ మరింతగా శ్రమించాలి. ముఖ్యంగా ప్రేమవ్యవహారాలు, ర్యాగింగ్ వంటి దుశ్చర్యలకు దూంగా ఉండాలి. వ్యాపారులు గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఆకర్షణీయమైన పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. షాపుల స్థలమార్పు అనివార్యం. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ఇన్స్యూరెన్స్ ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. టార్గెట్లను కూడా విజయవంతంగా పూర్తి చేయగల్గుతారు. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఆతిధ్యం అందరినీ ఆకట్టుకుంటుంది. పరస్పరం విలువైన కానుకలిచ్చిపుచ్చుకుంటారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు, ఆధ్యాత్మిక సంస్థల్లో సభ్యత్వాలు స్వీకరిస్తారు. సభలు, కీలక సమావేశాల్లో తరచుగా పాల్గొంటారు. మొత్తంమ్మీద ఈ రాశివారికి కార్యసిద్ధి, వ్యవహారజయం, మానసిక ప్రశాంతత, ఆరోగ్యలాభం, వస్త్రప్రాప్తి వంటి శుభఫలితాలున్నాయి.

సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?

సీఎం విజయ్ కేబినెట్ మహిళా మంత్రిపై యూట్యూబర్ మారిదాస్ అసభ్యకర వీడియో?: అతడు బైటకు రావడం కష్టమేనా?తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్లో మహిళా మంత్రిపై తమిళనాట ప్రముఖ యూ ట్యూబర్ మారిదాస్ అసభ్యకరమైన వీడియోను చేసి పోస్ట్ చేసారని ఆరోపణలు వచ్చాయి. దీనితో అతడిపై చెన్నై సైబర్ క్రైమ్ విభాగంలో కేసు నమోదయ్యింది. సోమరవారం ఉదయం మధురైలోని అతడి నివాసానికి చెన్నై పోలీసులు వెళ్లారు. మధురై నగర పోలీసులను వెంటబెట్టుకుని అతడి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసారు. కాగా మారిదాస్ ఇప్పటికే ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గంలోని మహిళా మంత్రితో పాటుగా మరికొందరు మంత్రులకు వ్యతిరేకంగా వీడియోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 79, 352(2) కింద కేసు నమోదు చేసారు.

Minor girl: మైనర్ బాలికపై అత్యాచారం.. ఆపై భవనం పైనుంచి కిందకు తోసేశాడు..

కుక్క కరిచిన వ్యక్తి ఎలా అయిపోయాడో చూడండి, వీడియో

07-06-22 ఆదివారం ఫలితాలు - సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమే

07-06-2026 నుంచి 13-06-2026 వరకు ఫలితాలు - అన్ని విధాలా యోగదాయకమేమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం పరిస్థితులు క్రమంగా చర్చబడతాయి. నిర్దేశిత లక్ష్యంతో ముందుకు సాగుతారు. ఆదాయం ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. పరిచయాలు, వ్యాపారాలు అధికమవుతాయి. మంగళవారం వాడు పనులు ఒక పట్టాన పూర్తికావు. మీపై శకునాల ప్రభావం అధికం, సన్నిహితుల వ్యాఖ్యలు ఉత్సాహపరుస్తాయి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన శ్రేయస్కరం. పెద్దల సలహా పాటించండి. జూదాలకు పోవద్దు. ఆప్తులతో తరచు సంభాషిస్తారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు బదిలీ. అధికారులకు హోదా మార్పు, వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు.