Astrology Zodiac Gemini Edu.htm

Notifications

మిధునం మిధునం
విద్య

వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు. అలాగే జీవనగమనంలో సైతం ఉన్నతాశయాలతో ముందుకు వెళుతుంటారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలం అవుతాయి. ఏదిఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం.

జనసేన ఎమ్మెల్యే సతీమణి ZPTC ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యే తిక్క కుదిరిందంటూ కామెంట్స్

జనసేన ఎమ్మెల్యే సతీమణి ZPTC ఎన్నికల్లో ఓటమి, ఎమ్మెల్యే తిక్క కుదిరిందంటూ కామెంట్స్జనం నాయకులకు తమదైన శైలిలో షాకిస్తుంటారు. ఓటింగ్ సమయంలో తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఈ విషయాన్ని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చాలాసార్లు తమ నాయకులకు ఉద్బోధన చేస్తూనే వుంటారు. ఇప్పుడు అట్లాంటి ఉదాహరణ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి జడ్పిటిసీ ఎన్నికల్లో పోటీ చేసారు. ఐతే రాష్ట్రమంతా కూటమి గాలి కొడుతుంటే ఇక్కడ మాత్రం ఎమ్మెల్యే గారి సతీమణి వైసిపి అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎమ్మెల్యే గారికి తిక్క కుదిరిందని ఒకరు కామెంట్ చేస్తే మరొకరు... కుటుంబంలోని వాళ్లకే ఇచ్చుకుంటారా...

గెలిచిన అభ్యర్థిని ఓడిపోయాడని చెప్పడం సాధ్యమేనా? రోజా ఆందోళన, ఈడ్చుకెళ్లిన పోలీసులు, వీడియో

గెలిచిన అభ్యర్థిని ఓడిపోయాడని చెప్పడం సాధ్యమేనా? రోజా ఆందోళన, ఈడ్చుకెళ్లిన పోలీసులు, వీడియోమాజీమంత్రి, వైసిపి నాయకురాలు ఆర్కే రోజా ఎన్నికల అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసారు. నగరి నియోజకవర్గం పరిధిలోని ఎంపిటిసి, జడ్పిటిసి ఓట్ల లెక్కింపు ముగిశాక ఇల్లాత్తూరు ఎంపీటిసీ స్థానంలో వైసిపి అభ్యర్థి గెలిస్తే, తెదేపా అభ్యర్థి గెలిచినట్లు అధికారులు చెప్పారంటూ రోజా ఆందోళకు దిగారు. కౌంటింగ్ కేంద్రం వద్ద రోడ్డుపై బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. పోలీసుల జులుం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. రోడ్డుపై కూర్చుని ఆందోళన చేస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందనీ, రోడ్డుపై నుంచి ఖాళీ చేయాలంటూ పోలీసులు విన్నవించినా ఆమె అక్కడే కూర్చున్నారు.

రాహుల్‌ ఎదిగినా... కాంగ్రెస్‌ బలం తగ్గింది: వరుస ఎన్నికల ఓటములపై అమిత్‌షా విమర్శలు

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దు

08-11-2026 నుంచి 14-11-2026 వరకు వారఫలాలు - ఆర్థిక వివరాలు ఇతరులకు వెల్లడించవద్దుమేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. లక్ష్యం నెరవేరుతుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు త్వరితగతిన సాగుతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాత వ్యక్తులు తప్పుదారి పట్టిస్తారు. దూరపు బంధువుల శుభలేఖ అందుతుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కుదిరే సూచనలున్నాయి. అవతలి వారి స్థితిగతులు క్షుణ్ణంగా తెలుసుకోండి. సంస్థల స్థాపనకు అనుమతులు మంజూరవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. దైవదీక్ష స్వీకరిస్తారు.

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమే

Diwali 2026: దీపావళి రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం.. ఈ రాశుల వారికి అంతా శుభమేదీపావళి పండుగ రోజున బుధాదిత్య యోగం, నీచభంగ రాజయోగం వంటి అద్భుత యోగాలు ఏర్పడనున్నాయి. ఎంతో శుభ ఫలాలను అందించగల యోగాల వల్ల మేషం, వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభం తదితర రాశుల జీవితంలో అదృష్టం, అద్భుతమైన ఫలితాలు రానున్నాయి. దీపావళి పండుగలో ఏర్పడే గ్రహ యోగాల వల్ల ఈ ఏడాది వివిధ యోగాలు ఏర్పడనున్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం స్వాతి నక్షత్రంతో పాటు ఆయుష్మాన్, సౌభాగ్య యోగాలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా తులా రాశిలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు అనే గ్రహాలు, సింహ రాశిలో గురువు, కేతువు, కుజుడు అనే గ్రహాలు కలిసి సంచారం చేస్తున్నాయి. బుధుడు, శుక్రుడి స్థితి వల్ల నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇలాంటి అద్భుత యోగాలు దీపావళి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చనున్నాయి.

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?

Diwali 2026: దీపావళి రోజున చేయకూడని ఆ నాలుగు తప్పులేంటి?దీపాల పండుగ అయిన దీపావళిని చాలా మంది కేవలం వేడుకకు సంబంధించిన రోజుగానే భావిస్తారు. కానీ దీపావళి పండుగ మన ఇంట్లోనూ, జీవితంలోనూ సంతోషాన్ని, మంగళాన్ని, సంపదను శాశ్వతంగా ఉండేలా చేసే అద్భుతమైన పర్వదినం. ఇది మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందే రోజుగా భావిస్తారు. ఈ రోజున తెలియకుండా ఈ తప్పులను చేయకూడదు. దీపావళి పండుగ అనేది మన ఇంట్లోనూ, జీవితంలోనూ ఉన్న అజ్ఞానం, దుఃఖం అనే చీకటిని తొలగించి, మేలు, సంతోషం, అభివృద్ధి, సంపద వంటి వాటిని ప్రసాదించేందుకు ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి శక్తివంతమైన రోజుగా దీపావళి రోజును భావిస్తారు. అందువల్ల ఈ రోజున చేసే పూజలు, దానధర్మాలు, పూజా కార్యక్రమాలు మనకు ఎంతో గొప్ప ఫలితాలను, పుణ్యఫలాలను ప్రసాదిస్తాయని నమ్మకం.