Festivals

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు



ముక్కలవుతున్న పాకిస్తాన్, స్వతంత్రం ప్రకటించుకున్న బెలూచిస్తాన్?

ముక్కలవుతున్న పాకిస్తాన్, స్వతంత్రం ప్రకటించుకున్న బెలూచిస్తాన్?పాకిస్తాన్ దేశం రెండు ముక్కలవబోతోంది. ఆ దేశంలోని బెలూచిస్తాన్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా తాము పాకిస్తాన్ దేశం నుంచి విడిపోతామని ఆందోళన చేస్తున్నారు. బలూచ్ ప్రాంతంలో వున్న అమూల్యమైన ఖనిజ సంపదనంతా పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకెళ్లి బలూచ్ ప్రజలకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆందోళనలు చేస్తున్నారు. మా సంపదను దోచుకుని మమ్మల్ని అభివృద్ధికి ఆమడదూరంలో పెడతారా అంటూ వారు నిరసిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం బెలూచిస్తాన్ కోసం పోరాడుతున్నవారిని అణచివేస్తూనే వుంది. కానీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడి ప్రజలు పాక్ సైన్యంతో పోరాడుతున్నారు.

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తి

Bhadrachalam: గోదావరి పుష్కరాలకు ముందే భద్రాద్రి పునరుద్ధరణ పనులు పూర్తిభద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం నాడు అధికారులకు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలంలోని శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయ పునరుద్ధరణ పనులను వేగవంతం చేసి, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలకు ముందే వాటిని పూర్తి చేయాలని ఆయన సూచించారు. పునరుద్ధరణ పనులను పరిశీలించే క్రమంలో ప్రాజెక్ట్ పురోగతిని సమీక్షించిన కలెక్టర్, భక్తులకు 'ఉత్తర ద్వార దర్శనం' కల్పించేందుకు వీలుగా ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల వేగాన్ని పెంచేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని, యంత్రాలను వినియోగించాలని ఆయన సూచించారు.

05-08-2026 నాటి రాశి ఫలితాలు... ఈ రోజు అనుకూలదాయకమే

04-08-2026 మంగళవారం ఫలితాలు.. మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు..