Nri

Notifications

  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.



గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)

గూగుల్ మ్యాప్ తప్పిదం.. విదేశీ మహిళను కాపాడిన మహిళా రాపిడో రైడర్ (Video)రాపిడో డ్రైవర్లుగా మహిళలు ప్రస్తుతం రాణిస్తున్నారు. పురుషులకు ధీటుగా రాపిడో డ్రైవర్లు వాహనాలు నడుపుతున్నారు. తాజాగా ఓ మహిళా రాపిడో డ్రైవర్ నెటిజన్ల ప్రశంసలు అందుకుంది. గూగుల్ మ్యాప్స్ తప్పిదం వల్ల దారి తప్పిన విదేశీ మహిళకు అండగా నిలిచిన మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు ప్రశంసలతో కొనియాడుతున్నారు. చుట్టుపక్కల ఎవరూ లేక భయాందోళనకు గురవడంతో విదేశీ మహిళకు భరోసానిచ్చి ఆ విదేశీ మహిళను సురక్షితంగా హోటల్‌కు చేర్చిన సింధు అనే మహిళా రాపిడో రైడర్‌ను నెటిజన్లు కితాబిస్తూ పోస్టులు పెడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తనను రక్షించిన రాపిడో రైడర్‌పై విదేశీ మహిళ కూడా కృతజ్ఞతలు తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

లెబనాన్‌లో స్వాధీనం చేసుకున్న భూభాగాల నుంచి వైదొలగం.. కాట్జ్

చీరాల బీచ్‌లో 17ఏళ్ల బాలుడిని కాపాడిన పోలీసులు

చీరాల బీచ్‌లో 17ఏళ్ల బాలుడిని కాపాడిన పోలీసులుఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాల సమీపంలో ఉన్న ఓడరేవు బీచ్‌లో, భారీ అలల ధాటికి సముద్రపు ఉధృతమైన నీటిలో కొట్టుకుపోయిన 17 ఏళ్ల బాలుడిని ఆంధ్ర మెరైన్ పోలీసులు ఆదివారం రక్షించారు. బీచ్‌లో ఈత కొడుతుండగా అఖిలేష్ అనే ఆ బాలుడు సముద్రం లోపలికి కొట్టుకుపోయాడు. ప్రమాదాన్ని గమనించిన కారంచేడు సబ్-ఇన్‌స్పెక్టర్ వెంటనే మెరైన్ పోలీసు బృందాన్ని అప్రమత్తం చేశారు. అపారమైన ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ, మెరైన్ కానిస్టేబుల్ ఏడుకొండలు, స్థానిక ఈతగాళ్లు ఉధృతంగా ఉన్న సముద్రపు నీటిలోకి దూకారు. వారు ఆ బాలుడిని చేరుకుని, లైఫ్‌బాయ్ సహాయంతో సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు.

ఢిల్లీలో సేన ప్రస్థానం.. అధికారం కాదు.. ప్రజా సంక్షేమంపైనే దృష్టి.. పవన్ కల్యాణ్