1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. APSRTC to run 6400 special buses for Sankranti

నేటి నుంచి ఏపీలో సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లో రాయితీలు..

apsrtc bus
సంక్రాంతి పండుగ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సులను నడుపనుంది. ఈ పండుగ కోసం 3120 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అలాగే, తిరుగు ప్రయాణంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు 3280 బస్సులు నడిపేందుకు చర్యలు తీసుకుంది. 
 
ఈ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ప్రయాణ చార్జీలో 5 నుంచి 25 శాతం మేరకు రాయితీని కల్పించనుంది. ఈ ప్రత్యేక బస్సులో ముందస్తు రిజర్వేషన్లను ఆర్టీసీ యాప్, అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా అందుబాటులో ఉంచారు. 
 
ప్రయాణికులు రానుపోను ఒకేసారి టిక్కెట్ రిజర్వు చేయించుకుంటే పది శాతం, నలుగురి మించి కుటుంబ సభ్యులందరూ ఒకేసారి ప్రయాణిస్తే 5 శాతం, అలాగే వాలెట్ ద్వార టిక్కెట్ కొనుగోలు చేస్తే 5 శాతం, వృద్ధుల చార్జీల్లో 25 శాతం తగ్గింపు ప్రకటించింది. ఈ సంక్రాంతి బస్సులు శుక్రవారం నుంచి ఈ నెల 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. మొత్తంగా 3120 బస్సులను అధికారులు సిద్ధం చేశారు. 
తర్వాతి కథనం
2024 జనవరి ఒకటో తేదీన రామాలయం ప్రారంభం : అమిత్ షా