1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Congress CM candidate is Pawan Kalyan: Chinta Mohan sensational Comments

జనసేనాని పవన్‌కు కాంగ్రెస్ ఆఫర్.. ఓకే అంటే సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తాం..?

pawan kalyan
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాంగ్రెస్ సూపర్ ఆఫరిచ్చిందనే చెప్పాలి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జనసేనాని ఓకే అంటే ఆయనను సీఎం అభ్యర్థిగా నిలబెడతామంటూ కామెంట్ చేశారు.
 
ప్రస్తుతం ఏపీలో జనసేన పార్టీ, అధికారికంగా తెలుగుదేశం (టీడీపీ) భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కూటమిలో భాగస్వామిగా కొనసాగుతోంది. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన ఎంతో పటిష్టంగా ఉన్న ఇలాంటి తరుణంలో, చింతా మోహన్ చేసిన ప్రతిపాదనకు రాజకీయ ప్రయోజనాలు ఎంతవరకు వుంటాయనే దానిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఆ పార్టీకి మళ్లీ ఏపీలో జీవం పోయాలంటే.. నాయకత్వం పక్కాగా వుండాలి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ బలమైన నాయకుడి కోసం వల విసురుతుందనే చెప్పాలి. 
 
అయితే 2014లో కాంగ్రెస్ హఠావో-దేశ్ బచావో నినాదంతోనే ఆయన జనసేన పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో, చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలను జనసేన శ్రేణులు పెద్దగా పట్టించుకోవడం లేదు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రచారానికి గొంతుకగా మార్చడం ద్వారా వారిని గౌరవిస్తున్న కోకా-కోలా