బుధవారం, 29 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 29 ఏప్రియల్ 2026 (16:20 IST)

నాడు దానవీశూరకర్ణ - నేడు కుంభకర్ణుడు : సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం

ktrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారంలోకి రాకముందు దానవీరశూరకర్ణగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత కుంభకర్ణుడుగా మారిపోయారని విమర్శించారు. రైతుల గురించి సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్‌లు, డైలాగ్‌లు మాత్రమే ఇస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ ఉంటే.. 'రైతు భరోసా'ను వాయిదాలుగా ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. 
 
'ఎవరు వచ్చినా రైతు బంధు ఆగదని గతంలో కొందరు మాట్లాడారు. ఇవాళ రైతు బంధు నిధులు సరిగా ఎందుకు రావట్లేదు? యూరియా ఎందుకు దొరకట్లేదు? గత ప్రభుత్వంలో తప్పులేమీ జరగలేదని నేను అనడం లేదు. దెబ్బమీద దెబ్బ తగిలితే పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం రావడం సహజం. ఓటమి తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఎంపీ సీట్లు గెలవలేకపోయాం. కాంగ్రెస్‌ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీల ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేసింది. వైఎస్సార్‌ తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని మేం కొనసాగించాం. ఇప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు' అని కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. 
 
పసుపు జెండా పౌరుషం ఎన్నిటికీ తగ్గదు : చంద్రబాబు 
 
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడుగా ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే, ఆ పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కూడా ఘనంగా  జరిరగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా మంత్రి నారా లోకేశ్ బాధ్యతలు చేయించారు. పాత, కొత్త కలయికతో కమిటీలను పార్టీ అధినాయకత్వం ఏర్పాటు చేసింది. పార్టీ చరిత్రలో తొలిసారిగా మండల, క్లస్టర్ స్థాయి నేతలకు పోలిట్ బ్యూూరో చోటు కల్పించారు. 
 
ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, బలమైన క్యాడర్‌ కలిగిన ఏకైక పార్టీ తెలుగు దేశం అన్నారు. 'ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు చాపచుట్టేస్తున్నాయి. గెలిచినా.. ఓడినా.. సగర్వంగా ఎగిరే జెండా పసుపు జెండా. 44 ఏళ్లలో అనేక సంక్షోభాలు, సవాళ్లను చూశాం. పసుపు జెండా పౌరుషం ఎప్పుడూ తగ్గలేదు. 2024 ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే వచ్చే ఎన్నికల్లో అధికంగా రావాలి' అని పేర్కొన్నారు.  
 
'నాలుగు దశాబ్దాలుగా పార్టీ కమిటీలను నియమిస్తున్నాం. సీనియర్లను గౌరవిస్తూ.. కొత్తవారికి అవకాశం ఇచ్చాం. కష్టపడిన వారికి చోటు కల్పిస్తూ కమిటీలు ఏర్పాటు చేశాం. సీనియారిటీ, సిన్సియారిటీతో దాదాపు 250 మందితో కమిటీ ఏర్పాటు చేశాం. మండల పార్టీ అధ్యక్షురాలు, క్లస్టర్‌ ఇన్‌ఛార్జిని పొలిట్‌బ్యూరో సభ్యులుగా చేయగలిగాం. కార్యకర్తే అధినేత అనేది మన సిద్ధాంతం.. ఆచరణలో చేసి చూపించాం' అని చంద్రబాబు అన్నారు.