1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Nara Lokesh Appointed Working President

టీడీపీ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్

nara lokesh
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులను ప్రకటించింది. ఇందులో భాగంగా నారా లోకేష్‌ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది.

2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయ, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుంటూ, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ కొత్త కమిటీలను ఖరారు చేశారు. ఇది ఆ పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంకేతంగా చూడవచ్చు. అటు పార్టీ, ఇటు ప్రభుత్వం పనులను అత్యంత సమర్ధంగా నిర్వహిస్తున్నారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. 
 
దీంతో వచ్చే ఎన్నికలలో కూటమిని గెలిపించుకొని మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లు, ఏడాది లేదా రెండేళ్ళలోనో నారా లోకేష్‌కి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించి తాను పూర్తిగా పార్టీకి అంకితం కావచ్చు లేదా హుందాగా రాజకీయాల నుంచి తప్పుకొని అవసరమైనప్పుడు పార్టీకి, ప్రభుత్వానికి మార్గదర్శకం చేయవచ్చు.
 
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావునే పార్టీ కొనసాగించింది. అలాగే, కింజరాపు రామ్మోహన్ నాయుడు, బైరెడ్డి శబరి, రాజేష్ కిలారులను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించింది.
తర్వాతి కథనం
APSDMA: ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు.. 46 మండలాల్లో తీవ్రమైన వడగాలులు