30-08-2026 నుంచి 05-09-2026 వరకు వార ఫలితాలు - మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు
Weekly Horoscopes
తలపెట్టిన కార్యం విజయవంతమవుతుంది. శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. పనులు త్వరితగతిన సాగుతాయి. మంగళవారం నాడు అవగాహన లేని విషయంలో జోక్యం తగదు. కొందరు మీ వైఖరిని తప్పుపడతారు. ప్రముఖులు వాదనతో వివాదం సద్దుమణుగుతుంది. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. ఫోన్ సందేశాల పట్ల ఆప్రమత్తంగా ఉండాలి. ముఖ్యమైన వివరాలు వెల్లడించవద్దు. మీ ఇబ్బందిని ఆప్తులకు తెలియచేయండి. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి, వ్యాపారాలు క్రమంగా పుంజుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. కొత్తయత్నాలు చేపడతారు.
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొత్త పనులు చేపడతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. నూతన దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. బుధవారం నాడు ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయంతో కాలక్షేపం చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. గృహ మరమ్మత్తులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తుల పదోన్నతికి అధికారులు సిఫార్సు చేస్తారు. సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరం.
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
వ్యవహార పరిజ్ఞానంలో రాణిస్తారు. పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. మాటతీరు ఆకట్టుకుంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. శనివారం నాడు ఆచితూచి అడుగేయాలి. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆప్తులతో సంభాషిస్తుంటారు. ఖర్చులు ప్రయోజనకరం. ఆలయాలు, సేవ సంస్థలకు విరాళాలు అందిస్తారు. దంపతులు మధ్య సఖ్యత సలకొంటుంది. కుటుంబంలో ప్రశాంతత పొందుతారు. అవివాహితులకు శుభసమయం. సంతానం దూకుడు అదుపు చేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవచ్చు. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలు కలిసివస్తాయి. నోటీసులు అందుకుంటారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సంతోషకరమైన వార్త వింటారు. ప్రతిభకు తగిన గుర్తింపు, సముచితస్థానం లభిస్తాయి. అందరితోను సౌమ్యంగా మాట్లాడండి. ఎవరినీ తక్కువగా వేయవద్దు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. మీ ఉన్నతిని దాటుకోవటానికి వ్యయం చేస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తవుతాయి. దూరపు బంధువులు ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సోమవారం నాడు ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు చర్చకు వస్తాయి. మీ చొరవతో వివాహసంబంధం నిశ్చయమవుతుంది. పరిచయస్తులకు సన్నిహితులవుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు విరమించుకోవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. సలహాలు, సహాయం ఆశించవద్దు. వారే మిమ్ములను చిన్నచూపు చూస్తారు. ఆదాయం నిరాశాజకం, పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. బుధవారం నాడు ఊహించని ఖర్చు చికాకుపరుస్తుంది. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనుల్లో ఒత్తిడి. శ్రమ అధికం. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వివరాలు వెల్లడించవద్దు. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధాలు బలపడతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి.
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులు వాయిదా పడతాయి. నిరుత్సాహానికి గురవుతారు. ఏది జరిగినా మంచికేనని భావించండి. ఓర్పుతో యత్నాలు సాగించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. శుక్రవారం నాడు అందరితోను మితంగా సంభాషించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంతానానికి శుభం జరుగుతుంది. పోయాయనుకున్న వస్తువులు లభ్యమవుతాయి. చిరువ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త ఉద్యోగ బాధ్యతల పట్ల శ్రద్ధ వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ అభ్యంతరాలను కచ్చితంగా తెలియజేయండి. శుభకార్యానికి హాజరుకాలేదు.
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యసాధనలో సఫలీకృతులవుతారు. మీ పట్టుదల ప్రశంసనీయవుతుంది. పనులు చురుకుగా సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వివరీతంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. తరచు ఆత్మీయులతో సంభాషిస్తుంటారు. ఆహ్వానం అందుకుంటారు. పరిచయాలు బలపడతాయి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి. అధికారులకు హోదామార్పు. ముఖ్యులకు స్వాగతం, ఆత్మీయ విడ్కోలు పలుకుతారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఈ వారం అన్ని విధాలా కలిసివస్తుంది. అవకాశాలను చేజిక్కించుకుంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా లెక్కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన రశీదులు జాగ్రత అర్ధాంతంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు దిగ్విజయమవుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు ఆశావహదృక్పథంతో ఇంటర్వ్యూలకు హాజరుకండి. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లకు ధీటుగా స్పందిస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. రుణవిముక్తులవుతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులతో కాలక్షేపం చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. మీ నుంచి వివరాలు రాబట్టేందుకు కొంతమంది యత్నిస్తారు. ఆర్థిక విషయాలు వెల్లడించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలకు ఆమోదం లభిస్తుంది. దంపతులు మధ్య అన్యోన్యత నెలకొంటుంది. నూతన పెట్టుబడులకు అనుకూలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగ విధుల పట్ల ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆశావహదృక్పథంతో మెలగండి. ఏ విషయాన్ని సమస్య అనుకోవద్దు. వ్యాపకాలు సృష్టించుకోండి. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. ఆప్తులతో తరచూ సంభాషిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. బుధవారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో ముందుకు సాగుతారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఆహ్వానం అందుకుంటారు. నూతన పరిచయాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టిపెడతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగ కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. జూదాలు, బెట్టింగ్ జోలికి పోవద్దు.
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అనుకూలతలు అంతంత మాత్రమే. మీ కృషి ఫలించదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆదాయం సామాన్యం, దుబారా ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలవదు. గురువారం నాడు అనేక పనులతో సతమతమవుతారు. పరిచయస్తుల రాక చికాకు పరుస్తుంది. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఆప్తులతో కాలక్షేపం చేయండి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. పెద్దల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఏకాగ్రతతో ఉద్యోగ విధులు నిర్వహించండి. అధికారులకు స్థానచలనం వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. కీలక చర్చల్లో పాల్గొంటారు.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
ఆర్ధికలావాదేవీలతో తీరిక ఉండదు. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తగవు. నిపుణుల సలహా పాటించండి. రాబోయే ఆదాయానికి, ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఆదివారం నాడు పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు అర్థాంతంగా నిలిపివేస్తారు. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. అహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోనిద్దు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వం స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. వ్యతిరేకులతో జాగ్రత్త. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలు చేస్తారు. పాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఓర్పుతో ఉద్యోగ యత్నం సాగించండి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది.
