1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Alwal Horror Eight Men Gang Rape Intermediate Student in Hyderabad

మైనర్ బాలికపై నెలలు తరబడి సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

victim
తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరం, అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత దారుణమైన ఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ మైనర్ బాలికపై ఎనిమిది మంది కామాంధులు నెలల తరబడి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం బాధితురాలి కుటుంబం ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. దీంతో నిందితులపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
పోలీసుల కథనం మేరకు.. మచ్చబొల్లారానికి చెందిన 16 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. పదో తరగతిలో ఉన్నప్పుడు జెర్రీ వరుణ్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్ని నెలల క్రితం, ఆ యువకుడు చాక్లెట్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి, తన కారులోనే బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో మొదలైన నరకం నెలలపాటు కొనసాగింది.
 
ఆ తర్వాత జెర్రీ వరుణ్ ద్వారా రొమాల వరుణ్ అనే మరో యువకుడు పరిచయమయ్యాడు. అతడు బాలికకు మద్యం, సిగరెట్లు, గంజాయి వంటి మత్తు పదార్థాలు అలవాటు చేసి, కొంపల్లిలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. వీరేకాకుండా, డేవిడ్ వరుణ్ అనే ఇంకో వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై, మద్యం తాగించి అసభ్యంగా ప్రవర్తించాడు.
 
ఈ క్రమంలో తమ కుమార్తె ప్రవర్తనలో మార్పు గమనించిన తండ్రి ఈ నెల 9న ఆమెను మందలించడంతో, బాలిక బొల్లారం రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన నీరజ్ అనే వ్యక్తి, తన స్నేహితుడు విక్కీని పిలిపించాడు. ఇద్దరూ కలిసి బాలికకు మత్తుమందు ఇచ్చి, వేర్వేరుగా అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా, విక్కీ తన మరో స్నేహితుడు నిఖిల్‌తో కలిసి బాలికను దూలపల్లిలోని ఓయో గదికి తీసుకెళ్లాడు. అక్కడ నిఖిల్, అతడి ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 
ఆ రాత్రి బాధితురాలిని విక్కీ తన ఇంట్లో బంధించాడు. 10వ తేదీన అక్కడి నుంచి తప్పించుకున్న బాలిక మళ్లీ బొల్లారం రైల్వే స్టేషన్‌కు చేరుకోగా.. విక్కీ, అతడి స్నేహితుడు గణేశ్ కలిసి అడ్డుకున్నారు. వారు బాలికను బలవంతంగా మత్తులోకి దించి మేడ్చల్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి, అక్కడ రైలులో మరోసారి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
అనంతరం మల్కాజిగిరికి చేరుకుని, ధూల్‌పేటకు ఆటోలో వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా బాధితురాలు వారి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన బాలిక, జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు వివరించడంతో వారు వెంటనే అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గోద్రెజ్ ఆగ్రోవెట్ సంస్థ కొత్త చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్‌గా అనుశ్రీ సింగ్ నియామకం