ఏంటయ్యా ఇది..? పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నాడని మందలిస్తే మాస్టారిపై దాడి
teacher attacked by Student
పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నారని మందలించిన నేరానికి ఓ మాస్టారిపై పదవ తరగతి విద్యార్థులు పిడిగుద్ధుల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం, వీరవల్లి జడ్పీ హైస్కూల్లో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.
విద్యార్థుల దాడితో ఆ గురువు నొప్పికి తట్టుకోలేకపోయాడు. చెడు అలవాట్లకు దూరంగా వుండమని చెప్పినందుకు ఈ శిక్ష తప్పదా అన్నట్లు వాపోయాడు. ఉపాధ్యాయుడిపై దాడి చేస్తున్న విద్యార్థులను కొందరు అడ్డుకున్నా.. అప్పటికే ఆ టీచర్‌కు గాయాలు తప్పలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
పాఠశాల బాత్రూంలో సిగిరెట్లు తాగుతున్నారని మందలించిన నేరానికి ఓ మాస్టారిపై పదవ తరగతి విద్యార్థులు పిడిగుద్ధుల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా, గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం, వీరవల్లి జడ్పీ హైస్కూల్లో ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది. pic.twitter.com/FqI9MLp6Ka
— Kalyan Babu™ (@ram_aduri) March 4, 2026
