1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. A film starring Ishwar Rachi Raju as the hero and directed by Sridhar Gade has been launched.

Pujita Ponnada: ఈశ్వర్ రాచి రాజు హీరోగా శ్రీధర్ గాదె దర్శకత్వంలో చిత్రం ప్రారంభం

Ishwar Rachi Raju,  Likhitha, Pujita Ponnada, Sindhu Kasaram
Ishwar Rachi Raju, Likhitha, Pujita Ponnada, Sindhu Kasaram
కమిటీ కుర్రోళ్లు" మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా, నందు, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తుేన్న చిత్రం నేడు ప్రారంభమైంది. ఎస్ఆర్ కళ్యాణమండపం  డైరెక్టర్ శ్రీధర్ గాదె ఈ సినిమాకు దర్శకుడు. ఆది సాయి కుమార్ తో చుట్టాలబ్బాయ్ మూవీని నిర్మించిన వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 
ఈ రోజు పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండ రామిరెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
 
విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే హారర్ చిత్రమిది. ఈ సినిమాను సరికొత్త కథా కథనాలతో దర్శకుడు శ్రీధర్ గాదె ప్రేక్షకులకు చూపించబోతున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా ఉండి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
 
నటీనటులు - ఈశ్వర్ రాచి రాజు, నందు, లిఖిత, పూజిత పొన్నాడ, సింధు కాసారం, సురేష్ గురు, రాయల్ శ్రీ, మట్టా శివకుమార్, విహా దీకొండ, సునీత మనోహర్, అమ్మ రామచంద్రయ్య, తదితరులు
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Ilaiyaraaja : ఇళయరాజా సంగీతంతో మంజనతి షూటింగ్ ప్రారంభం