1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. Sapotas health benefits and tips

సపోటా పండులో ఏమున్నదో తెలుసా?

సపోటా పండు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగకుండా నియంత్రిస్తుంది. నీరసం తొలగి పనిచేయడానికి అవసరమయ్యే శక్తి సమాకూర్చుతుంది. సపోటాలో పుష్కలంగా లభించే కరోటిన్ కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. వ్యాధినిరోధక శక్తి

sapota
సపోటా పండు శరీర ఉష్ణోగ్రత అధికంగా పెరగకుండా నియంత్రిస్తుంది. నీరసం తొలగి పనిచేయడానికి అవసరమయ్యే శక్తి సమాకూర్చుతుంది. సపోటాలో పుష్కలంగా లభించే కరోటిన్ కంటి ఆరోగ్యానికి దోహదపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఈ పండులో గ్లూకోజ్, విటమిన్ సి, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది.
 
సపోటా పండును తీసుకుంటే జీర్ణక్రియకు చాలా మంచిది. అందువలన చిన్నపిల్లలకు, వృద్ధులకు కూడా ఈ సపోటా పండును ఇవ్వవచ్చును. ఇందులో సోడియం, పొటాషియం, మెగ్నిషియం ఎక్కువగా ఉంటాయి. గంధకం, క్లోరిన్ కూడా లభిస్తుంది. కొవ్వు పదార్థం, పిండి పదార్థం, నీరు పీచు పదార్థం సపోటాలో ఉంటాయి. పోషక విలువలున్న ఈ పండును తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని పెంపొందించడమే కాకుండా రక్తవృద్ధి కూడా కలుగుతుంది.
About Writer
Kowsalya