1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. iPhone 17 Pro Max Gets a Major Price Cut on Flipkart

iPhone 17 Pro Max : ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ కాస్మిక్ ఆరెంజ్ రంగుపై భారీ తగ్గింపు

iPhone 17 Pro Max
iPhone 17 Pro Max
ఫ్లిఫ్ కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల కొనుగోలుదారులు 256జీబీ మోడల్‌ను దాని ప్రారంభ ధర కంటే తక్కువకే పొందవచ్చు. కాస్మిక్ ఆరెంజ్ రంగు వేరియంట్ ధర ఇప్పుడు రూ.1,49,900 నుండి రూ.1,41,900కి తగ్గింది. అంటే ప్లాట్‌ఫారమ్ నుండి నేరుగా రూ.8,000 తగ్గింపు లభిస్తోంది. 
 
ఇప్పటికే ఐఫోన్ వాడుతున్నట్లయితే, ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. మీరు ఐఫోన్ 16ను ఎక్స్ఛేంజ్  చేస్తే ఫ్లిఫ్ కార్ట్ రూ.35,600 వరకు ఆఫర్ అందిస్తోంది. దీనికి ఇప్పటికే ఉన్న తగ్గింపును జోడిస్తే, 256జీబీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.98,300కి తగ్గుతుంది. ఇది ప్రారంభ ధరతో పోలిస్తే గణనీయమైన తగ్గింపు.
 
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర, ఆఫర్లు: 256 జీబీ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,41,900గా ఉంది. ఇది అసలు ధర రూ.1,49,900 నుండి 5శాతం తగ్గింపును సూచిస్తుంది. ప్రమోషన్‌లో భాగంగా ఫ్లిఫ్ కార్ట్ రూ. 8,000 తగ్గింపును అందిస్తోంది. ఫ్లిఫ్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు లభించే క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో కలిపి కూడా రూ.8,000 తగ్గింపును వెబ్‌సైట్ పేర్కొంది. 
 
ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫీచర్లు: 256GB వేరియంట్‌గా వస్తున్న ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఫోన్ ముందు భాగం దాదాపు పూర్తిగా ఆక్రమించేలా భారీ 6.9-అంగుళాల ఓఎల్డీఈ స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనిలో ఆపిల్ యొక్క సరికొత్త ఏ19 చిప్ (సిక్స్-కోర్ ప్రాసెసర్‌తో కూడినది) అమర్చబడింది. 
 
కెమెరా విషయానికొస్తే, దీని వెనుక భాగంలో మూడు 48ఎంపీ లెన్స్‌లతో కూడిన ట్రిపుల్-కెమెరా వ్యవస్థ, ముందు భాగంలో 18ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 256 జీబీ స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే, ఇందులో 4,823 ఎంఏహెచ్ సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ కూడా ఉంది. 
 
ఈ ఫోన్ కాస్మిక్ ఆరెంజ్ రంగులో లభిస్తుంది, అలాగే డీప్ సిల్వర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఫ్లిఫ్ కార్ట్  నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే, యాపిల్ నుండి ఒక సంవత్సరం వారంటీ లభిస్తుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఈశాన్య రాష్ట్రాల ప్రజలను గుర్తించని టెక్నాలజీ - వీడియోను షేర్ చేసిన మంత్రి