1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Kalyan Krishnamurthy to step down as Flipkart CEO

ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

flipkart
ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ నాయకత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 11 ఏళ్లకు పైగా సేవలందించిన గ్రూప్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఆయన నిష్క్రమణకు గల కారణాలు వెల్లడించలేదు. ఆయన స్థానంలో గ్రూప్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న బాలాజీ త్యాగరాజన్‌ తాత్కాలిక సీఈఓగా వ్యవహరించనున్నారు.
 
ఫ్లిప్‌కార్ట్‌ను సచిన్ బన్సల్, బిన్నీ బన్సల్ స్థాపించారు. వారు తప్పుకొన్నాక 2017లో కల్యాణ్‌ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2018లో ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌నకు సీఈఓ అయ్యారు. ప్రత్యర్థి సంస్థలైన అమెజాన్, మీషో నుంచి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కంపెనీని స్థిరంగా నిలబెట్టడంతో కీలక పాత్ర పోషించారు. జెన్‌జీ కస్టమర్లను ఆకర్షించడంతో పాటు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెట్టడం, బ్లింకిట్, జెప్టోలకు పోటీగా ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ను తీసుకురావడంపై దృష్టి సారించారు.
 
కృష్ణమూర్తి తప్పుకోవడానికి ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ.. సంస్థలో నెలకొన్న అంతర్గత సమస్యలు, ఐపీఓ జాప్యం, మాతృసంస్థ వాల్‌మార్ట్‌తో తలెత్తిన విభేదాలు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. స్టాక్‌మార్కెట్‌లో కంపెనీని లిస్ట్‌ చేయడంపై వాల్‌మార్ట్‌ ఇంకా నిర్ణయం తీసుకోకపోడంతో ఐపీఓ ఆలస్యం అవుతోంది. దీంతో కంపెనీ షేర్లను నగదుగా మార్చుకోలేకపోతున్నామన్న అసంతృప్తి ఉద్యోగుల్లో నెలకొంది. గడిచిన యేడాది కాలంలో వైస్‌ ప్రెసిడెంట్‌లు, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీని వీడారు. ఈ క్రమంలోనే కల్యాణ కృష్ణమూర్తి రాజీనామా నిర్ణయం వెలువడడం గమనార్హం. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి - తెల్లవారుజామున ఏం జరిగింది?