సంబంధిత వార్తలు
- అకస్మాత్తుగా గుండెపోటు వస్తే... తోటివారి ప్రాణాలు కాపాడటంపై శిక్షణ
- డాలస్‌లో నాట్స్ ‘స్వరవర్షిణి’ అదుర్స్... పోటీలకు తెలుగు ప్రజల విశేష మద్దతు
- న్యూజెర్సీలో నాట్స్ తెలుగు సంబరాల కర్టన్ రైజర్... విశేష స్పందన
- పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన నాట్స్... జవాన్ల కుటుంబానికి సానుభూతి
- అమెరికాలో అరెస్టయిన 200 మంది తెలుగు విద్యార్థులు... విడిపించేందుకు నాట్స్ యత్నం...
టెంపాలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ ఏర్పాటు చేసిన నాట్స్... పాస్ పోర్ట్ రెన్యువల్, వీసా ఇంకా...
ఫ్లోరిడా: అమెరికాలో తెలుగువారికి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ టెంపా నగరంలోని హెటీఎప్ ఆడిటోరియంలో కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అట్లాంటా, ఇండియన్ కమ్యూనిటీ ఆఫ్ టెంపా బే, నాట్స్ టెంపా బే విభాగాలు సంయుక్తంగా ఈ సర్వీసెస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశాయి.
దాదాపు 350 మందికి పైగా ఇక్కడ సేవలను వినియోగించుకున్నారు. వీసా రెన్యూవల్స్‌కు సంబంధించి 100 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. ఫవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికెట్, లీగల్ డాక్యుమెంట్లకు సంబంధించి 50 మందికి పైగా దరఖాస్తు చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ సేవలకు సంబంధించి ఇంత మంచి కార్యక్రమాన్ని నాట్స్ చేపట్టినట్టుందుకు స్థానిక తెలుగువారితో పాటు భారతీయులు నాట్స్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.
టెంపా నాట్స్ చాప్టర్ సమన్వయకర్త రాజేశ్ కాండ్రు నేతృత్వంలో ఈ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నాట్స్ వాలంటీర్లు దీనికోసం ప్రచారం చేయడంతో పాటు ఈ సేవా కేంద్రంలో తమ విలువైన సేవలు అందించారు. టెంపాలో తెలుగువారి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా నాట్స్ నాయకత్వం తెలిపింది.
తర్వాతి కథనం
