1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
  4. Worshipping Hanuman In Amavasya Can Also Remove Problems From Your Life

Amavasya: అమావాస్య రోజున హనుమంతునికి పూజ.. ఆలయానికి వెళ్తే...?

Hanuman
అమావాస్య రోజున హనుమంతునికి పూజ చేయడం విశేషం. శనివారం పూట అమావాస్య రావడం విశేష ఫలితాలను ఇస్తుంది. అమావాస్య రోజున పిండి ఉండలు చేసి చేపలకు వేయడం లేదా చీమలకు పంచదార కలిపిన పిండిని చల్లడం వల్ల కాలసర్ప దోష ప్రభావం తగ్గుతుంది. 
 
ముఖ్యంగా ఈ రోజున మహిళలు తమ భర్త క్షేమం కోరుతూ విష్ణుమూర్తిని ఆరాధించడం ఆచారంగా వస్తోంది. అమావాస్య రోజున రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, ప్రదక్షిణలు చేయడం వల్ల పితృ దోష తీవ్రత తగ్గుతుంది. 
 
ఈ రోజున నువ్వులు కలిపిన నీటిని పితృ దేవతలకు అర్పిస్తూ వారిని స్మరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వారు తృప్తి చెంది వారసులకు సుఖశాంతులను ప్రసాదిస్తారని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 
 
ఇంకా అమావాస్య రోజున హనుమంతుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. ఇంకా హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పించడం ద్వారా సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంకా శని దోషాలు తొలగిపోతాయి. ఇక్కడ విశేషం ఏంటంటే.. శనివారం అమావాస్య రావడం, శని జయంతి రావడంతో హనుమంతుడి ఆలయాన్ని సందర్శించడాన్ని మరిచిపోవద్దునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
హనుమంతుడు శివుని అవతారం అని అంటారు. విష్ణుమూర్తికి, శివునికి మధ్య చాలా బలమైన బంధం ఉందని నమ్ముతారు. విష్ణుమూర్తి రామ అవతారం ఎత్తినప్పుడు, శివుడు కూడా హనుమంతుడిగా అవతరించాడు. వారిద్దరూ భూమిపై వ్యాపించి వున్న అధర్మం నుండి భూమిని రక్షించారు. హనుమంతుడు శ్రీరాముని ఆజ్ఞలను ఎంత శ్రద్ధగా పాటించడంతో, అతనికి అమరత్వం పొందే వరం లభించింది. ఈ వరంతో, హనుమంతుడు తన భక్తులను ఆపద సమయాల్లో రక్షిస్తాడు. 
 
హనుమంతుడు అన్ని రకాల ప్రతికూల శక్తులను తొలగించగలదు. ధైర్యంగా, నిర్భయంగా జీవించడం ఎలాగో ఆయన మనకు బోధిస్తాడు. అలాగే  దేవాలయంలో రామ రక్షా స్తోత్రం చదవడం మంచి ఫలితాలను ఇస్తుంది.
About Writer
సెల్వి