సంబంధిత వార్తలు
- శ్రీవారి భక్తులకు అలెర్ట్ : ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
- వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శనం చేసుకున్న 116 యేళ్ళ భామ
- కాలి నడకన తిరుమలకు 116 యేళ్ల వృద్ధురాలు.. 6న వీఐపీ బ్రేక్ దర్శనం
- 116 ఏళ్ల వయసులో శ్రీవారి మెట్లెక్కిన బామ్మ.. వీడియో వైరల్
- తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం
తిరుమల అలిపిరి నడక మార్గంలో చిరుతపులి సంచారం (video)
తిరుమల అలిపిరి నడక మార్గంలో శుక్రవారం నాడు చిరుతపులి కనిపించడంతో భక్తులు భయాందోళనలకు గురయ్యారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం సమీపంలో చిరుత కనిపించడంతో భక్తులు భయపడిపోయారు. ఆలయం దగ్గర చిరుతపులిని గమనించిన భక్తులు వెంటనే పెద్దగా కేకలు వేశారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, ఇనుప కడ్డీలతో పెద్ద శబ్దాలు చేస్తూ ఆ చిరుతపులిని తిరిగి అడవిలోకి పంపించివేశారు. భక్తులు భద్రత దృష్ట్యా నడక మార్గంలో ఒంటరిగా వెళ్లవద్దని, గుంపులుగా ప్రయాణించాలని అధికారులు సూచించారు.
తిరుమల నడక మార్గంలో పులి?
— ChotaNews App (@ChotaNewsApp) July 11, 2026
AP: తిరుమల నడక మార్గంలో పులి సంచరించినట్లు ప్రచారం జరగడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ఓ వీడియోలో పులి కనిపించనప్పటికీ, అటవీ ప్రాంతం కావడంతో భక్తులు భయపడుతుండటం కనిపిస్తోంది. ఒకవేళ నిజంగానే వన్యప్రాణులు వస్తే భక్తుల భద్రత ఏమిటనే ప్రశ్నలు… pic.twitter.com/cyRerwlGtg
