సంబంధిత వార్తలు
- కేసీఆర్ ప్రాణాలకు ముప్పు వుంది.. భద్రతను మరింత పెంచాలి.. రేవంత్
- అసదుద్దీన్‌ను క్రేన్‌కి తలకిందులుగా వేలాడదీసి గెడ్డం గొరిగిస్తా... ఆ తర్వాత: బిజెపి ఎంపి ధర్మపురి
- తెలంగాణ సీఎం పీఠంపై కేటీఆర్ స్పందన.. ఏం చెప్పారంటే?
- రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు లైవ్ పెట్రోల్ బాంబులు.. అనిల్ విజ్
- కేసీఆర్, కేటీఆర్‌లను పొగుడుతున్న టీడీపీ ఫ్యాన్స్.. జగన్‌ను మాత్రం?
తిరుమలలో కేటీర్ దర్శనం వివాదాస్పదం, ఆయన గుడిలోకి ఎలా వెళ్లారో చెప్పాలంటూ
ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువులు కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రలు ఎమ్మెల్యేలు వెంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోవడానికి క్యూ కట్టారు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి తిరుమలకు విఐపిల తాకిడి ఎక్కువ అయింది. ఇందులో భాగంగా స్వామిని దర్శించుకోవడాని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటిఆర్, భార్య శైలిమి, కుమార్తెతో సహా వచ్చారు.
అయితే నిబంధనలకు విరుద్ధంగా కేటిఆర్‌ని బయోమెట్రిక్ ద్వారా శ్రీవారి ఆలయంలోకి అనుమతించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ప్రోటోకాల్ పరిధిలోని వ్యక్తులను కంపార్టుమెంట్లలో వేచివుండేలా చేసి కేటిఆర్‌ని మాత్రం ముందుగానే ఆలయంలోకి ఎలా తీసుకువెళతారని విమర్శించారు భారతీయ జనతా పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి.
సోమవారం వేకువజామున 12.30 గంటల నుండి 1.30 గంటల మధ్య ఆలయ ప్రవేశం చేసిన వారి వివరాలను బహిర్గతం చెయ్యాలని, సిసి టివి ఫుటేజిని మీడియాకు విడుదల చెసి భాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు భాను ప్రకాష్ రెడ్డి. శ్రీవారి ఆలయ సంప్రదాయాలను కాపాడవలసిన పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుందని, అంతేగాని నచ్చిన వారి కోసం నిబంధనలు మార్చడం మహాపాపం అన్నారు భాను ప్రకాష్ రెడ్డి. గతంలో భాను ప్రకాష్ రెడ్డి తిరుమల తిరుపతి బోర్డు మెంబరుగా పనిచేశారు.
తర్వాతి కథనం
