1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Akshay Kumar daughter Nitara cyber harassment case

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెకు వేధింపులు.. ఒకరి అరెస్టు

akshay kumar
సినీ సెలెబ్రిటీల కుమార్తెలకు కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కుమార్తెను ఓ పోకిరి వేధించాడు. దీనిపై మహారాష్ట్ర పోలీసులు ఓ నిందితుడుని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ యశస్వి వెల్లడించారు. 
 
తన కుమార్తె వేధింపులకు గురవుతున్నట్లు అక్షయ్ కుమారే స్వయంగా అధికారుల దృష్టికి తీసుకువచ్చారని ఆయన తెలిపారు. ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడం వల్లే నిందితుడిని పట్టుకోవడం సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు.గత యేడాది అక్టోబరు నెలలో ముంబై స్టేట్‌ పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన 'సైబర్‌ అవేర్‌నెస్‌ మంత్‌ 2025' కార్యక్రమానికి అక్షయ్‌ కుమార్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 
 
ఆ సమయంలో సైబర్‌ క్రైమ్‌ గురించి మాట్లాడుతూ.. తమ ఇంట్లో జరిగిన ఘటనను వెల్లడించారు. తన కుమార్తె ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడుతున్న సమయంలో అపరిచితుడి నుంచి మెసేజ్‌ వచ్చిందని న్యూడ్‌ఫొటోలు పంపాలని అతడు సందేశం పంపాడని, ఈ విషయం తన కుమార్తె ఇంట్లో చెప్పడంతో సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు సైబర్‌ క్రైమ్‌పై అవగాహన కల్పించేలా సైబర్‌ ఎడ్యుకేషన్‌ను వీక్లీ సబ్జెక్ట్‌గా పెట్టాలని ఈసందర్భంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Lavanya: లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి రిలీజ్‌ కు సిద్ధం