1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Jyothi Poorvazh... 'Killer' release date announcement glimpse.

Jyothi Poorvazh: జ్యోతి పూర్వజ్.. కిల్లర్ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్

Killer Release Date Glimpses
Killer Release Date Glimpses
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
 
"కిల్లర్" సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తి కలిగిస్తోంది. ఈ సినిమా విడుదలయ్యే అక్టోబర్ 17న మన దేశపు గొప్ప సైంటిస్ట్ డా.పూర్వజ్ ను ఏలియన్స్ కాంటాక్ట్ అవుతారు. ఒక స్పేస్ షిప్ ను భూమికి పంపిస్తున్నట్లు తెలియజేస్తారు. ఈ విషయాన్ని మిగతా వారికీ చెప్పమని, తాము మానవులను రక్షించాలని అనుకుంటున్నట్లు ఆ ఏలియన్ డా.పూర్వజ్ కు చెబుతుంది. మన భవిష్యత్, ఆ ఏలియన్ కు గతం. ఇలా మరో కాలం నుంచి వస్తున్న ఆ ఏలియన్ డా.పూర్వజ్ ను ఎందుకు కాంటాక్ట్ అయ్యింది ?, స్పేస్ షిప్ ను భూమికి ఎందుకు పంపించాలనుకుంది ?, మానవాళికి ఏర్పడిన ముప్పు ఏంటి ?, ఆ ఏలియన్ చేయాలనుకున్న సాయం ఏంటి ? వంటి ప్రశ్నలతో  రిలీజ్ డేట్ గ్లింప్స్ క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. 'అక్టోబర్ 17న మీ భవితను నిర్ణయిస్తాం..' అంటూ గ్లింప్స్ చివరలో వేసిన క్యాప్షన్ ఆకట్టుకుంటోంది.
 
ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఓఎంజి పిక్చర్స్ ఈ సినిమాను ఓవర్సీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ సంస్థ "కిల్లర్" సినిమాను అమెరికా, యూరప్, కెనడా, అరబ్ దేశాలు, మలేషియా, న్యూజిలాండ్, రష్యా వంటి దేశాల్లో విడుదల చేయబోతోంది.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Venky Atluri :సూర్య గారిని దృష్టిలో ఉంచుకొని కథ రాయలేదు : వెంకీ అట్లూరి