సంబంధిత వార్తలు
- డబ్బు చెల్లించాం కదా... అంటూ ఆ నలుగురు ఆమెపై సామూహిక అత్యాచారం... ఆ తర్వాత?
- టిడిపి-కాంగ్రెస్ దోస్తి... జనంలోకి వెళ్ళాలంటేనే భయపడుతున్న కార్యకర్తలు...
- ప్రణయ్‌ని ప్రేమించానని బాబాయ్ కొడుకు నా చేయి పట్టుకుని... అమృత
- పేరుకే సోషల్ వర్కర్లు.. చేసేది వ్యభిచారం... ఎక్కడ?
- జన్మాష్టమి రోజున ఇలా పూజ చేస్తే.. శ్రీకృష్ణాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే?
పని పూర్తి కాలేదో.. మూత్రాన్ని తాగించడం, బొద్దింకను తినిపించడం, టాయిలెట్ నీటిని..?
నిర్ణీత సమయంలో పనిని పూర్తి చేయని కారణంగా ఓ చైనాకు చెందిన ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు చీదరించుకునే శిక్షలను అమలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన ఓ ఇంటీరియర్ డెకరేషన్ ఉత్పత్తులను తయారు చేసే సంస్థలో పనిచేసే ఉద్యోగులు టాయిలెట్ నీటిని తాగాలని కఠినశిక్ష విధించింది.
చైనా, కుయిసోహూ ప్రావిన్స్‌లోని ఓ ప్రైవేట్ సంస్థ.. నిర్ణీత సమయానికి పనులను పూర్తి చేయని ఉద్యోగులకు కఠిన శిక్ష విధిస్తోందని తెలిసింది. ఈ శిక్షలు దారుణంగా వుంటాయని వెల్లడి అయ్యింది. ఇందులో మూత్రాన్ని తాగించడం, ప్రాణాలతో వున్న బొద్దింకను తినేలా చేయడం.. టాయిలెట్ నీటిని తాగించడం వంటి దారుణమైన శిక్షలుంటాయని తేలింది. ఈ శిక్షలను తోటి ఉద్యోగుల ముందు నిలబెట్టి అమలు చేస్తారని.. అప్పుడే నిర్ణీత సమయానికి వారు పనిని పూర్తి చేస్తారని సదరు సంస్థ భావించేదని తెలిసింది.
ఈ వ్యవహారం.. ఆ సంస్థ నుంచి తప్పుకున్న ఉద్యోగులు వీడియో రూపంలో బయటపెట్టడం ద్వారా బహిర్గతం అయ్యింది. ఆధారాలతో పాటు పోలీసులకు ఫిర్యాదులు అందడంతో.. ఆ సదరు సంస్ధకు చెందిన ముగ్గురు మేనేజర్లను అరెస్ట్ చేసి.. రిమాండ్ తరలించారు.
