అమెరికాలో అమ్మాయి పెళ్లి.. సూర్యాపేటలో వీడియో కాల్ ద్వారా ఆశీర్వదించిన తల్లిదండ్రులు (video)
Wedding
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రోహిత్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ అమెరికాలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కూతురి పెళ్లిని దగ్గరుండి జరిపించాలని భావించిన జయరాజు, జ్యోతి దంపతులు అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించారు.
అయితే, వీసా సంబంధిత సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం చివరి నిమిషంలో ఆగిపోయింది. దీంతో వారు నిరాశకు లోనైనా.. టెక్నాలజీ సాయంతో వారు తమ కుమార్తె వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు. అమెరికాలో హిమబిందు, రోహిత్‌ల వివాహం జరుగుతుండగా, స్వగ్రామంలోని తమ నివాసం నుంచి తల్లిదండ్రులు వీడియో కాల్ ద్వారా వేడుకను ప్రత్యక్షంగా వీక్షించారు.
కళ్లారా కూతురి పెళ్లిని చూడలేకపోయామన్న బాధ ఉన్నప్పటికీ, ఆన్‌లైన్‌లోనే నూతన దంపతులను మనసారా ఆశీర్వదించారు. అంతేకాకుండా, బంధుమిత్రులు, గ్రామస్థుల కోసం తమ గ్రామంలో ఘనంగా విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్లైన్లో కూతురు పెళ్లి చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు
— ???? ???????????????????????? ???? (@dmuppavarapu) August 30, 2026
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం వేపలసింగారం గ్రామంలో తమ ఏకైక కుమార్తె హిమబిందు పెళ్లిని ఆన్లైన్లో చూసి అక్షింతలు చల్లిన తల్లిదండ్రులు జయరాజు, జ్యోతి pic.twitter.com/a99iNPp3qt
