పాకిస్థాన్ : బైక్ మీద పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్
Pakistan Bike Rider
ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్ దేశంలో ఒక వీధిలో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బైక్ మీద పదిమంది ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
సాధారణంగా ఒక ద్విచక్ర వాహనం మీద ఇద్దరు ప్రయాణిస్తారు. కానీ ఆ బైక్ మీద ముగ్గురు మహిళలు.. వారి చేతులలో మరో ఆరుగురు పిల్లలు.. మొత్తం పది మంది కూర్చోవడంతో చూసేవాళ్ళు విస్తు పోయారు. పాకిస్తాన్లో ఇది కామన్ అయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో వెలుగులోకి రావడంతో.. చూసే నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయింది.
ఈ బండి నడుపుతున్న వ్యక్తి ఏకంగా ఫ్యూయల్ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉండటం విశేషం. ప్రాణాలు తెగించి వారు చేస్తున్న ఈ ప్రయాణంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
