1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Train hits a cow - video viral in social media

Cow: ఆవును ఢీకొన్న రైలు.. ఆవుకు ఏమైందంటే? (video)

Train
Train
సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతూ వుంటాయి. కొన్ని వీడియోలు వింతగా వుంటాయి. తాజాగా ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇంకా ఆ వీడియోలో ఏముందంటే..? వేగంగా వస్తున్న రైలు ముందు ఆవు నిలబడింది. అంతే రైలు ఏమాత్రం ఆగలేదు.. ఆవు మీదకు రైలు అలానే కదిలింది. అయితే రైలు ఢీకొన్నా ఆ ఆవు ప్రాణాలతో బయటపడింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
 
ఈ వీడియో ఆ ఆవు రైలు ముందు కాస్త దూరం వరకు ఈడ్చుకెళ్లింది. అయితే ఆ ఆవు పట్టాల నుంచి కాస్త దూరంగా పడి.. ఆపై మెల్లగా లేచి నిల్చుంది. దీంతో అక్కడున్న వారంతా హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఆవుకు ఏమైందో ఏమో కానీ కాసేపు ఆ ఆవు నిల్చుండిపోయింది. ఈ వీడియో నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
దుబాయ్‌కి వెళ్లిన 24 ఏళ్ల మహిళ అదృశ్యం.. ఏమైంది?