1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Unethical alliance between TRS and BJP, Says Nara Lokesh

అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుంది : నారా లోకేశ్

తెలంగాణ రాష్ట్రంలో తెరాస - బీజేపీల పొత్తుపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇది అక్రమ సంబంధంలాంటిందన్నారు. ఇలాంటి అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుందని ఆయన ప

Nara Lokesh
తెలంగాణ రాష్ట్రంలో తెరాస - బీజేపీల పొత్తుపై ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఇది అక్రమ సంబంధంలాంటిందన్నారు. ఇలాంటి అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని ఆరోపించారు. అందుకే బీజేపీ చెప్పినట్టుగా తెరాస అధినేత కేసీఆర్‌ నడుస్తున్నారని విమర్శించారు. 
 
బీజేపీతో కలవనని కేసీఆర్‌ చెప్తున్నారని.. కానీ అంతా కేంద్రం చెప్పిన ప్రకారమే నడుస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందే పొత్తు పెట్టుకున్న టీడీపీ కంటే కేసీఆర్‌కు కేంద్రం బాగా సహకరించిందన్నారు. అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుందని వ్యాఖ్యానించారు. 
 
అలాగే, ఏపీలో అవినీతిపరుడు జగన్‌కు కేంద్రం సహకరిస్తోందని లోకేశ్‌ దుయ్యబట్టారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రానికి పంపిస్తే ఇంతవరకు ఆమోదించలేదని అన్నారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
గుప్త నిధుల కోసం సొంత తమ్ముడు కుమారుడినే...