Woman

Notifications

  1. ఇతరాలు
  2. మహిళ



Pawan Kalyan: ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు.. నా కళ్లు చెమర్చాయి.. పవన్ (video)

Pawan Kalyan: ప్రధానిపై అవమానకరమైన వ్యాఖ్యలు.. నా కళ్లు చెమర్చాయి.. పవన్ (video)భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నీట్ నిరసనల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన దూషణలు తనను తీవ్రంగా బాధించాయని ఆయన పేర్కొన్నారు. "ప్రధానిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు విన్నప్పుడు తన కళ్లు చెమర్చాయని పవన్ చెప్పారు. దేశం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక జాతీయ నాయకుడిని, దేశభక్తుడిని మనం ఇలాగేనా చూసుకునేది? దేశం కోసం ఆయన పడిన కష్టాలు యువతరానికి తెలుసా? మోదీపై వచ్చే ఏ విమర్శ అయినా మాపై వచ్చిన విమర్శగానే భావిస్తాం. ఈ దేశంలో మోదీని ఓడించగల నాయకుడు లేడు, ఇకపై కూడా ఉండడు. తనను అవమానించిన వారిని కూడా క్షమించేంత గొప్ప మనసున్న మోదీ గారి పాదాలకు నేను నమస్కరిస్తున్నాను," అని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో కూడిన ప్రసంగంలో అన్నారు.

మూర్చపోయిన టీచర్‌కి గుండెపోటు వచ్చిందని సీపీఆర్, పక్కటెముకలు విరిగాయి, వీడియో

మూర్చపోయిన టీచర్‌కి గుండెపోటు వచ్చిందని సీపీఆర్, పక్కటెముకలు విరిగాయి, వీడియోమధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కైలారస్ ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలికి గుండె పోటు వచ్చిందేమోనని సీపీఆర్ చేయడంతో ఆమె రెండు పక్కటెముకలు విరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమెకు గుండెపోటు వచ్చిందన్న పొరపాటున సీపీఆర్ (CPR) చేయడంతో ఆమె పక్కటెముకలు రెండు విరిగాయి. మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌లో లలిత అనే ఉపాధ్యాయురాలు రోడ్డుపై వెళ్తోంది. ఐతే తీవ్రమైన ఎండ కారణంగా తన స్కూటర్ పైనుంచి ఆమె కింద పడిపోయారు. అక్కడే ఉన్న ఇద్దరు యువకులు ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించి, ఆమెకు నిరంతరాయంగా సీపీఆర్ చేయడం ప్రారంభించారు. ఆసుపత్రిలో పరీక్షించిన తర్వాత, ఆమెకు గుండెపోటు రాలేదని వైద్యులు వెల్లడించారు.