1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
  4. Gauva health benefits

థైరాయిడ్‌‌ను దూరం చేసే జామపండు

Gauva health benefits
పండ్లు తింటే ఆరోగ్యంగా ఉండవచ్చని మనందరికీ తెలుసు. రకరకాల పండ్లు మనకు రకరకాల పోషకాలు అందిస్తాయి. అలాగే కొన్ని పండ్లు తినడం వల్ల రోగాలు కూడా నయం అవుతాయి. వాటిలో జామ పండు ఒకటి.
 
జామపండును రోజూ తీసుకోవటం వలన థైరాయిడ్‌ నుండి విముక్తి పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుందని అంటున్నారు నిపుణులు. అందుకే విటమిన్-సి లోపించడం వలన వచ్చే వ్యాధులను జామకాయ తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు అని, అంతేకాకుండా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను జామకాయ దరిచేరనివ్వదు అని అంటున్నారు.
 
జామలో చాలా శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్‌లను నివారిస్తుంది. జామపండులో విటమిన్-సితో పాటు విటమిన్-ఏ చాలా ఎక్కువ. జామను రోజుకొకటి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ, తద్వారా బరువును నియంత్రించుకోవచ్చు.
 
జామపండులో ఉన్న విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాల వలన మెదడు చురుగ్గా ఉంటుంది. ఈ విటమిన్స్ వలన మెదడులోని న్యూరాన్‌లు సమర్థవంతంగా పని చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
About Writer
సందీప్
తర్వాతి కథనం
తలలో చుండ్రు పోవాలంటే తమలపాకులను మెత్తగా రుబ్బి?