1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Madhya Pradesh horror: Woman dies on birthday after checking into hotel with 6 friends

ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి - తెల్లవారుజామున ఏం జరిగింది?

mp girl dies
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్‌లో 21 యేళ్ళ యువతి ఓయో హోటల్ గదిలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ప్రియుడితో కలిసి పుట్టిన రోజు వేడుకను జరుపుకునేందుకు వచ్చిన ఆ యువతి తెల్లవారే సరికి విగతజీవిగా కనిపించింది. ప్రియుడు, అక్క, మరో స్నేహితురాలు కొందరు యువకులతో కలిసి శారదాదేవి ఆలయం సమీపంలోని హోటల్‌లో మూడు గదులను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలియకుండా వారంతా హోటల్ గదులకు చేరుకున్నారు. 
 
అయితే, తెల్లవారుజామున 4 గంటల సమయంలో యువతి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ప్రైవేట్ భాగాల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతున్నట్టు ప్రియుడు చెప్పగా, ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. 
 
ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వెంట వచ్చినవారు ప్రయత్నించగా, ఆస్పత్రి సిబ్బంది అడ్డుకుని, పోలీసులకు సమాచారం చేరవేశారు. యువతి మృతిపై ఆస్పత్రి  సిబ్బంది అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు  చేసి విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన సీఎం విజయ్ సర్కారు.. ఎందుకో తెలుసా?