ఇంటర్ విద్యార్థిని తీసుకుని లేచిపోయిన 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు
Updated: Thu, 26 Nov 2026 (14:17 IST)
ఉత్తరప్రదేశ్లోని బస్తీ నుండి ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన జరిగింది. ఒక పాఠశాల ఉపాధ్యాయురాలు తన వద్ద చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని తీసుకుని పారిపోయింది. బస్తీ జిల్లాలోని కప్తాన్గంజ్లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు, అదే పాఠశాల యజమాని కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది.
రూపాలి అనే ఈ ఉపాధ్యాయురాలు గత ఏడాది కాలంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ సమయంలో ఆమె పాఠశాల యజమాని కుమారుడితో సన్నిహితంగా మెలుగుతూ, గంటల తరబడి అతనితో సంభాషించేది. ఇంటర్ చదువుతున్న ఆ బాలుడి వయస్సు 16 ఏళ్లు. ఇద్దరూ కలిసి వెళ్లిపోవడంతో సమీప ప్రాంతాలలో గాలించినా ఫలితం దక్కలేదు. దీనితో పాఠశాల యజమాని పోలీసు స్టేషన్లో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. పారిపోయిన వారి ఆచూకి కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.
About Writer
ఇమ్మడిశెట్టి వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. ....
మరింత చదవండి