1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Rajasthan News: Bank Theft Case

రాజస్థాన్ బ్యాంకులో దొంగతనం.. అలా వచ్చి ఇలా క్యాష్ బ్యాగు ఎత్తుకెళ్లాడు.. (video)

Crime
Crime
రాజస్థాన్‌లోని ఓ బ్యాంకులో రెండు లక్షల రూపాయలను ఓ దుండగుడు దోచుకెళ్లాడు. అతను బ్యాంకులోకి వెళ్లి.. రూ. 2.40 లక్షలతో పరారయ్యాడు. రాజస్థాన్‌లోని బరన్ జిల్లా కేంద్రంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రకాష్ గుప్తా అనే వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుండి రూ. 2.40 లక్షలు డ్రా చేసి.. వాటిని ఒక బ్యాగులో పెట్టుకున్నాడు
కౌంటర్ వద్ద బ్యాగును ఉంచి సిబ్బందితో మాట్లాడుతుండగా.. అక్కడ ఉన్న ఒక దొంగ దృష్టి ఆ బ్యాగుపై పడింది. అది గమనించిన దొంగ, ఎవరికీ తెలియకుండా ఆ బ్యాగును తీసుకుని.. తన బ్యాగులో వేసుకుని బ్యాంకు బయటకు నడిచి వెళ్లాడు. ఆ తర్వాత, తనతో వచ్చిన వ్యక్తితో కలిసి బైక్‌పై పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆగష్టు 18, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుందంటే?