1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Haryana BJP leader's nephew beaten to death over suspected affair with friend's wife

స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం - బీర్ పార్టీకి పిలిచి రాడ్‌తో కొట్టి హత్య

murder
హర్యానా రాష్ట్రంలో దారుణం జరిగింది. తన భార్యతో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో బీజేపీ నేత మేనల్లుడిని అతడి స్నేహితుడే కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం మేరకు.. సెప్టెంబరు 7వ తేదీన హర్యానా రాష్ట్రంలోని హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీ సమీపంలో జితేంద్ర (40) అనే వ్యక్తి మృతదేహం రక్తపు మడుగులో పడివుంది. తలపై బలమైన గాయాలు ఉండటంతో హత్యగా నిర్ధారించిన పోలీసులు... జితేంద్ర మామ, బీజేపీ నేత ఉత్తమ్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తన భార్యతో జితేంద్రకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అతడి స్నేహితుడు ప్రవీణ్ ఈ హత్యకు పక్కా ప్లాన్ వేసి చంపేసినట్టు తేలింది. 
 
సెప్టెంబరు 7వ తేదీన బీర్ పార్టీ పేరుతో జితేంద్రను ప్రవీణ్ బయటకు పిలిచాడు. ఇద్దరూ కలిసి మద్యం సేవించిన తర్వాత హెచ్.పి.సి.ఎల్ రిఫైనరీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కారు దిగి జితేంద్రపై వెనుక నుంచి ఇనుపరాడ్‌తో పలుమార్లు దాడి చేసి చంపేశాడు. ఈ సమయంలో ప్రవీణ్ మేనల్లుడు అమన్ చుట్టూ కాపలా కాశాడు. ఈ దాడి మొత్తం సమీపంలోన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. 
 
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు... జర్తాల్ సమీపంలోని ప్రవీణ్, అమన్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రవీణ్ నేరం చేసినట్టు అంగీకరించాడు. తన భార్యపై అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
జిల్లాకు ముగ్గురు మంత్రులున్న ఒరింగేదేమీ లేదు : తెలంగాణ జనసేన నేతలు