1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Female teacher caught with an intermediate student at a Lucknow hotel

ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్

Teacher
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ నుండి రూపాలి అనే ఉపాధ్యాయురాలు తన వద్ద చదువుకుంటున్న ఇంటర్ విద్యార్థిని తీసుకుని పారిపోయి అతడితో కలిసి లక్నో హోటల్లో కనబడింది. దీనితో వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని బాలుడిని బాలుర శిశు సంక్షేమ కమిటికి అప్పగించారు. అక్కడ ఆ బాలుడి నుంచి అవసరమైన సమాచారాన్ని తీసుకుని అతడిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇక ఉపాధ్యాయురాలి వద్ద విచారణ కొనసాగుతోంది. బాలుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం ఏమిటి? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలను ఆమె వద్ద నుంచి రాబడుతున్నారు.
 
కాగా ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని కప్తాన్‌గంజ్‌లో ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 26 ఏళ్ల ఉపాధ్యాయురాలు, అదే పాఠశాల యజమాని కుమారుడిని తీసుకుని వెళ్లిపోయింది. రూపాలి అనే ఈ ఉపాధ్యాయురాలు గత ఏడాది కాలంగా ఆ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది.
 
ఈ సమయంలో ఆమె పాఠశాల యజమాని కుమారుడితో సన్నిహితంగా మెలుగుతూ, గంటల తరబడి అతనితో సంభాషించేది. ఇంటర్ చదువుతున్న ఆ బాలుడి వయస్సు 16 ఏళ్లు. దీనితో పాఠశాల యజమాని పోలీసు స్టేషన్‌లో పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు. పారిపోయిన వారిద్దరూ లక్నోలోని హోటల్లో పట్టుబడ్డారు.
About Writer
ఇమ్మడిశెట్టి వెెంకట్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు- Webdunia Telugu సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి
తర్వాతి కథనం
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనే 98 శాతం ప్రకటనల ఉల్లంఘనలు: ఏఎస్‌సీఐ అర్థ వార్షిక ఫిర్యాదుల నివేదిక