1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Pawan Kalyan Offers Special Prayers At Triprayar Sree Rama Temple In Keralam

కేరళలో పవన్ కల్యాణ్.. త్రిప్రయార్ శ్రీరామునికి ప్రత్యేక పూజలు ఫోటోలు (video)

Pawan Kalyan
Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు కేరళలోని త్రిప్రయార్ శ్రీరామ ఆలయాన్ని సందర్శించి, ఆలయ సంప్రదాయాల ప్రకారం శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకృష్ణుడు, శ్రీరామస్వామి, అయ్యప్పస్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే, దీపారాధన, మీనుట్టు (చేపలకు ఆహారం వేయడం), వేడి వళిపాడు వంటి ఆలయ సంప్రదాయ కార్యక్రమాలలో కూడా ఆయన పాల్గొన్నారు. 
 
దీపారాధన సేవ కోసం విరాళం కూడా అందించారు. పూజల అనంతరం, ఆలయ ప్రధాన అర్చకుడు ఆయనకు తీర్థం, ప్రసాదం, ఆశీర్వచనాలను అందజేశారు. శ్రీ రామస్వామిని దర్శించుకునే ముందు, సంప్రదాయం ప్రకారం పవన్ కళ్యాణ్ అదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ కృష్ణుని ఆలయాన్ని సందర్శించారు. 
Pawan kalyan
Pawan kalyan
 
అనంతరం ఆయన మీనుట్టు సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తిరువ నదిలోని చేపలకు ఆహారాన్ని అందిస్తారు. తిరువ నదీ తీరంలో ఉన్న ఈ ఆలయంలో చేపలకు ఆహారం వేయడం అనేది ఒక దీర్ఘకాలిక సంప్రదాయం. చేపలకు ఆహారం సమర్పించడం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకు ఆయన మత్స్యావతారంలో ఆహారం సమర్పించడంతో సమానమని భక్తులు విశ్వసిస్తారు. శ్రీ రామస్వామి దర్శనం తర్వాత, అరటి కాండాలను పగలగొట్టే సంప్రదాయ ఆచారమైన వేది వళిపాదులో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. 
Pawan Kalyan
Pawan Kalyan

About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఎర్ర సముద్రంపై పట్టు సాధిస్తున్న హౌతీ తిరుగుబాటుదారు.. భారత్ ఆందోళన