Dallas: డల్లాస్‌లో గణేష్ చతుర్థి వేడుకలు.. డ్యాన్స్ ఇరగదీశారు.. వీడియో వైరల్
డల్లాస్‌లో, గణేష్ చతుర్థి కార్యక్రమం వైరల్‌గా మారింది. పలు కుటుంబాలు ఈ వేడుక సందర్భంగా ఒక్కటిగా చేరాయి. ఈ వేడుకల్లో అమెరికా పోలీసు అధికారి కూడా చేరారు. తద్వారా భారతదేశం పండుగ వాతావరణాన్ని డల్లాస్‌లో పునఃసృష్టించారు. అంతేగాకుండా ఈ సందర్భంగా పలు కుటుంబాలు ఒక్కటై డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
అయితే ఇలాంటి డ్యాన్సులు వినాయక చవితి ఉత్సవంలో తగవని కామెంట్లు చేస్తున్నారు. పెద్ద తెలుగు మాట్లాడే సమాజానికి నిలయమైన డల్లాస్, ఇప్పుడు డ్యాన్సుల కారణంగా వివాదానికి కేంద్రంగా ఉంది.
ఇకపోతే.. హైదరాబాద్‌లో శనివారం జరిగే గణేష్ నిమజ్జనం కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలు సజావుగా, ప్రశాంతంగా సాగేందుకు దాదాపు 30వేల మంది పోలీసులను మోహరించారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ సరస్సులో, నగరం, చుట్టుపక్కల ఉన్న డజన్ల కొద్దీ సరస్సులు, కృత్రిమ చెరువులలో వేలాది విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు.