బుధవారం, 3 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2025 (15:59 IST)

Onam Dance: కేరళలో ఓనం సంబరాల్లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి వ్యక్తి మృతి (video)

Onam
Onam
కేరళలో ఓనం సంబరాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కేరళ శాసనసభలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న జునైస్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్ర శాసనసభ నిర్వహించిన వేడుకల్లో భాగంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ 45 ఏళ్ల వ్యక్తి జునైస్ అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు విడిచారు. ఈ ఘటన అక్కడున్న వారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
 
వివరాల్లోకి వెళితే.. కేరళ శాసనసభలో అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తున్న జునైస్, ఇతర ఉద్యోగులతో కలిసి ఓనం వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో వేదికపై తోటివారితో కలిసి నృత్యం చేస్తుండగా కుప్పకూలి ప్రాణాలతో కోల్పోయాడు. 
వయనాడ్‌కు చెందిన జునైస్, గతంలో మాజీ ఎమ్మెల్యే పీవీ అన్వర్‌ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా కూడా పనిచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.