1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Supreme Court sets aside HC order for CBI, ED probe into Rahul Gandhi's assets

సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి ఊరట... అక్రమాస్తులపై ఈడీ విచారణ అక్కర్లేదు

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారంటా వచ్చిన ఆరోపణలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలన్న అలహాబాద్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ వి. మోహన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కింది కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేసింది. పైగా, ఈ అంశాన్ని తాజాగా పరిశీలించాలని అలహాబాద్ హైకోర్టుకు సూచన చేసింది. 
 
రాహుల్‌ గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ కర్ణాటకకు చెందిన విఘ్నేశ్‌ శిశిర్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలంటూ సీబీఐ, ఈడీలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ దీనిపై రాహుల్‌ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆగస్టులో హైకోర్టు చర్యలను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 
 
ఎటువంటి నివేదికను దాఖలు చేయవద్దని సీబీఐ, ఈడీలను కూడా అప్పట్లో ఆదేశించింది. తాజాగా అలహాబాద్‌ కోర్టు ఆదేశాలను పక్కనపెట్టిన ధర్మాసనం... ఈ కేసును తాజాగా పరిశీలించాలని, ఈ కేసుల విచారణ అర్హమా? కాదా? అనేది కూడా పరిశీలించాలని సూచించింది. రాహుల్‌ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని కూడా విఘ్నేశ్‌ పిటిషన్లు దాఖలు చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఏపీకి ప్రత్యేక రైళ్లు