సంబంధిత వార్తలు
- నిర్మలాదేవికి భర్త ఝలక్.. విడాకుల కోసం నోటీసులు పంపాడు..
- ఐపీఎల్ 2018 : ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్మెన్లపై మండిపడిన గంభీర్
- నేను క్రిస్టియన్ కాదు.. 100% శాతం హిందువునే: వంగలపూడి అనిత
- మహేష్ ఆ డైరెక్టరుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
- ''నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'' ఆడియో వేదిక అక్కడే.. బన్నీ, అనూ సెల్ఫీ?
నిర్మలాదేవిపై మరో ఇద్దరు అమ్మాయిల ఫిర్యాదు.. అందుకే ఆ తప్పు చేసిందట?
కాలేజీలో చదివే అమ్మాయిలను మాయ మాటలు చెప్పి... విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసులో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ
కాలేజీలో చదివే అమ్మాయిలను మాయ మాటలు చెప్పి... విద్యార్థినులపై లైంగిక ఒత్తిడి చేసిన అరుప్పుకోట్టై దేవాంగరై ఆర్ట్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలాదేవి కేసులో పోలీసులు కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చారు. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో అరెస్టయిన నిర్మలా దేవి వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నారు.
విద్యార్థినులతో జరిపిన ఫోన్ సంభాషణలు వెలుగులోకి రావడంతో ఈ కేసును సీబీసీఐడి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మలా దేవిపై మరో ఇద్దరు విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంలో నిర్మలాదేవికి సహకరించిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మురుగన్, రీసెర్చ్ స్టూడెంట్ కరుప్పు స్వామి అనే వ్యక్తిపై పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ప్రొఫెసర్ మురగన్‌ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అంతేగాకుండా నిర్మలాదేవి వద్ద పోలీసులు జరిపిన దర్యాప్తులో తన కుమార్తెకు మెడికల్ సీటును పొందేందుకు రూ.30 లక్షలు ఇచ్చి తాను మోసపోయానని వెల్లడించినట్టు తెలుస్తోంది. తాను మోసపోయిన డబ్బును ఎలాగైనా తిరిగి సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే అమ్మాయిలను ఎరవేసేందుకు ప్రయత్నించినట్టు సీబీసీఐడీ పోలీసులు భావిస్తున్నారు.
