శివయ్యను తనలో కలిపేసుకున్న గంగానది, 150 ఏళ్ల నాటి ఆలయం గంగార్పితం, వీడియో
అదేమిటోగానీ ఉత్తరాది రాష్ట్రాలు తీవ్రమైన భారీ వర్షాలు, వరదలతో గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ఇటువైపు దక్షిణాదిలో ఉక్కపోత, వేసవిని తలపించే ఎండలతో ఠారెత్తిస్తోంది ప్రకృతి. ఈ క్రమంలో ఉత్తరాది రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లా రుతువాలో గంగానది ఉగ్ర రూపం దాల్చింది. దాంతో ఫరక్కా బ్యారేజీకి ఏకంగా 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. దీనితో నీటిని దిగువ ప్రాంతాలకు వదిలేసారు.
గంగా నది ఉధృతికి తీర ప్రాంతాలన్నీ కోతకు గురయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో వుంటున్నవారు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. కానీ నది ఒడ్డున 150 ఏళ్ల క్రితం నిర్మించిన శివాలయం గంగానదిలో కొట్టుకుపోయింది. ఈ ఆలయాన్ని ఎలాగైనా కాపాడాలని ప్రజలు పెద్దఎత్తున ఇసుక మూటలు వేసారు. ఐతే నదీ ప్రవాహం ముందు అవన్నీ కరిగిపోయాయి. అందరూ చూస్తుండగానే ఆలయం నీటిలో కొట్టుకుపోయింది.
గంగానదిలో కొట్టుకుపోయిన 150 ఏళ్ల నాటి శివాలయం
— PulseNewsBreaking (@pulsenewsbreak) September 8, 2026
పశ్చిమ బెంగాల్లోని మాల్దా జిల్లా రతువా సమీపంలోని ములిరామ్తోలాలో ఘటన
భారీ వర్షాల వల్ల గంగానది ఉగ్రరూపం దాల్చడంతో.. నిండుకుండలా మారిన ఫరక్కా బ్యారేజ్
అక్షరాల 12 లక్షల క్యూసెక్కుల నీరు పారడంతో.. తీరప్రాంతం కోతకు గురైంది
ఈ… pic.twitter.com/yTQff83q19
