శుక్ర ప్రదోష వ్రతం.. శివుని అభిషేకాన్ని దర్శిస్తే.. ఏంటి ఫలితం?
Pradosha Vratham
ఇంకా వైవాహిక విభేదాలు తొలగిపోతాయి. దంపతుల మధ్య అన్యోన్యత చేకూరుతుంది. అవివాహితులు కూడా తగిన జీవిత భాగస్వామిని పొందడానికి శుక్రవారం ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. ఇంకా ఈ రోజు శివ పూజతో కర్మ, అడ్డంకులు తొలగిపోతాయి. ప్రదోష కాలంలో కర్మలు, దోషాలు, అప్పులు తొలగిపోతాయి.
జ్యోతిషశాస్త్రపరంగా, జాతకంలో బలహీనమైన, బాధిత లేదా నీచ స్థితిలో ఉన్న శుక్రుడు ఉన్నవారు గ్రహ దోషాలను నివారించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని పొందడానికి ఈ రోజు ఎంతగానో ఉపయోగపడుతుంది.
అలాగే ప్రదోషకాలంలో జరిగే ప్రార్థనలు, అభిషేకానికి కనులారా వీక్షించే వారికి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శివలింగానికి పాలు, తేనె, పెరుగు, నెయ్యి, నీరు (పంచామృత అభిషేకం) తో పాటు బిల్వ పత్రాలను సమర్పించాలి.
మంత్ర జపం: సంధ్యా సమయంలో మహా మృత్యుంజయ మంత్రాన్ని లేదా సాధారణ ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల పుణ్య ఫలం దక్కుతుంది.

