1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Jagtial: Electric Scooter Catches Fire After Battery Explosion While Charging

జగిత్యాలలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటర్.. ఛార్జింగ్ చేస్తున్నప్పుడు... (Video)

Electric Scooter
Electric Scooter
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరాంపుర కాలనీలో సోమవారం నాడు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు చెలరేగాయి. ఎన్‌. లక్ష్మీనారాయణ కొంతకాలం క్రితం ఎలెస్కో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశారు. సోమవారం నాడు ఆయన తన ఇంటి ఆవరణలో స్కూటర్‌ను ఛార్జింగ్‌కు పెట్టారు. అయితే, సుమారు 10 నిమిషాల తర్వాత ఆయనకు ఒక పెద్ద శబ్దం వినిపించింది. 
 
బయటకు వచ్చి చూసేసరికి, స్కూటర్ అంటుకుని పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1 లక్ష విలువైన ఆస్తి నష్టం వాటిల్లడంతో లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాటరీ పేలడానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్, సింగపూర్ మంత్రి (video)