ఛార్జింగ్ అవుతున్న ఫోన్ పేలడంతో 14 ఏళ్ల బాలుడి మృతి
Cell Phone
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న తన కుమారుడు సెల్ ఫోన్ బ్యాటరీ పేలుడు వల్ల తీవ్రంగా గాయపడ్డాడని మృతుడి తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గాయపడిన కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అతను మరణించాడు. ఛార్జింగ్‌లో ఉన్న ఫోన్ బ్యాటరీతో తన కుమారుడు ఏదో చేస్తుండగా అది పేలిందని తండ్రి పోలీసులకు తెలిపారు.
