సంబంధిత వార్తలు
- తెలంగాణలోని అవిన్య ప్లాంట్‌లో సరికొత్త హై-స్పీడ్ కిన్లే ప్రొడక్షన్ లైన్‌ను ప్రారంభించిన హెచ్‌సీసీబీ
- Heat Wave Alert : ఐదు రోజుల పాటు తెలంగాణలో వడగాలులు
- నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి
- కోతులకు పెట్టిన విషపూరిత ఆహారం ఆరగించి చిన్నారి మృతి
- ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ - ప్రాణాలు తీసుకున్న ఆరుగురు విద్యార్థులు
తెలంగాణాలో దంచికొడుతున్న ఎండలు... ఆరెంజ్ అలెర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, పాలమూరుతో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఆరెంజ్ హెచ్చరికలు జారీచేశారు. రానున్నా మూడు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపీ ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.
గురువారం నుంచి మూడు రోజులు పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం అవకాశం ఉందని పేర్కొంది.
జై శ్రీరామ్ అంటే ఫీజులో రూ.500 రాయితీ : వైద్యుడి ఆఫర్.. ఐఎంఏ షోకాజ్ నోటీస్
పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన ఓ వైద్యుడు చేసిన ప్రకటన పెను వివాదానికి దారితీసింది. తన వద్దకు వచ్చే వైద్యులు జై శ్రీరామ్ అంటూ నినాదం చేస్తే తాను తీసుకునే ఫీజులో రూ.500 తగ్గిస్తానంటూ ప్రకటన చేశారు. ఇది పెను వివాదంగా మారింది. దీంతో ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) దృష్టికి వెళ్లింది. దీంతో ఐఎంఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ తరహా ప్రకటన వైద్య వృత్తికే అవమానకరమని పేర్కొంటూ వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు జారీచేసింది.
వైద్యుడి వద్దకు వచ్చే రోగి మతం, కులం, రాజకీయ విశ్వాసాలతో సంబంధం లేకుండా సమానమైన చికిత్స పొందాలన్నది ఐఎంఏ స్పష్టం చేసింది. చికిత్సలో ఇలాంటి మతపరమైన నిబంధనలు విధించడంపై వైద్య వృత్తి నైదికతకు పూర్తిగా విరుద్ధమని తెలిపింది. ఈ తరహా చర్యలు రోగుల మధ్య వివక్షకు దారితీస్తుందని, సమాజానికి తప్పుడు సంకేతాలు పంపుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే, ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ డాక్టర్ హజ్రా తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. తన వ్యక్తిగత, రాజకీయ అభిప్రాయాలను వెల్లడించే హక్కు తనకు ఉందని, ఫీజులో రాయితీ ఇవ్వడం వల్ల రోగులకు మేలే జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ అంశం రాజకీయ రంగు పులుముకుంది. ఒకవైపు ఐఎంఏ క్రమశిక్షణా చర్యలకు సిద్ధమవుతుండగా, మరోవైపు, రాజకీయ పార్టీలు ఈ వివాదంపై విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు.
