1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Wife Murdered Husband With Lover's Help

ప్రియుడి మోజులో పడి.. భర్తను దారుణంగా హతమార్చింది..

crime scene
ప్రియుడి మోజులో పడిన ఓ భార్య, తన భర్తను దారుణంగా హతమార్చింది. ఆపై ఏమీ తెలియనట్టు గుండెపోటుతో చనిపోయాడంటూ డ్రామా ఆడింది. కానీ మెడపై ఉన్న గాయాలు ఆమె పాపాన్ని పట్టిచ్చాయి. ఈ షాకింగ్ ఘటన ఎడపల్లి మండలంలో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన ఓనె మహిపాల్ (29)కు స్వరూపతో వివాహమైంది. అయితే, స్వరూప వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ ప్రేమకు భర్త అడ్డు వస్తున్నాడని భావించిన స్వరూప, ప్రియుడితో కలిసి మహిపాల్‌ను వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. 
 
ఈ క్రమంలోనే ఇద్దరూ కలిసి మహిపాల్‌కు ఉరివేసి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మహిపాల్ గుండెపోటుతో మరణించాడంటూ గ్రామంలో ప్రచారం చేసింది. మహిపాల్ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో, అతని మెడపై వింతగా ఉన్న గాయాన్ని గ్రామస్తులు గమనించారు. 
 
గుండెపోటుతో చనిపోతే మెడపై గాయాలు ఎలా వస్తాయనే అనుమానంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
Jagan: పవన్ కల్యాణ్‌ను సైడ్ క్యారెక్టర్ అని తీసిపారేసిన జగన్