Astrology Monthly Horoscope Details

Notifications

మిథునం మిథునం
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు సంప్రదింపులు ఫలిస్తాయి. రావలసిన ధనం అందుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి. అర్హులకు సాయం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ప్లాన్‌లో సవరణలు సాధ్యమవుతాయి. సన్నిహితులతో నిత్యం సంభాషిస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలం. బ్యాంకు పనులు పూర్తవుతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి చేస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. మీ ప్రయత్నం త్వరలో ఫలిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి పథకాలు చేపడతారు. వృత్తి, ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. రుణ విషయాల్లో జాగ్రత్త. ఏకాగ్రతతో వ్యవహరించండి.

ఏయ్ దూరం పాటించు అని చెప్పిన మహిళా బైకర్‌ను కారుతో ఢీకొట్టాడు, వీడియో

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..

13-09-2026 నుంచి 19-09-2026 వరకు వార ఫలితాలు.. ఏ రాశికి లాభం..మేషం: అశ్విని, భరణి 1,2,3,4 పాదాలు, కృత్తిక 1వ పాదం. కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. కీలక పత్రాలు జాగ్రత్త. శనివారం నాడు అందరితో మితంగా సంభాషించండి. ఎదుటివారు మీ వ్యాఖ్యలను తప్పుపట్టే అవకాశం ఉంది. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. కొందరి నిర్లక్ష్యం ఇబ్బంది కలిగిస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. ఉపాధ్యాయులకు పదవీయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. చిరువ్యాపారులకు సామాన్యం. అనుకున్న మొక్కులు తీర్చుకుంటారు.

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?

Brahmotsavams: సెప్టెంబర్ 15 నుండి 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. 10వ శతాబ్దం నుంచే ఆ చరిత్ర..?సెప్టెంబర్ 15 నుండి 23 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల సిద్ధమవుతుండగా, వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఉత్సవం తొమ్మిది రోజుల పాటు సాగుతుంది. నేడు మనం చూస్తున్న ఊరేగింపులు, వాహన సేవలు, ఆచారాలు, వివిధ కాలాల్లోని పాలకులు, ఆలయ నిర్వాహకులు, భక్తుల ద్వారా శతాబ్దాలుగా జరిగిన మార్పులు, చేర్పుల ఫలితమే. పురాణాల ప్రకారం, శ్రీనివాస స్వామి వెంకటాచలంపై ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని మొదటిసారిగా నిర్వహించారు. అందుకే దీనికి బ్రహ్మోత్సవం అని పేరు వచ్చింది. అయితే, ఈ ఉత్సవం శతాబ్దాల కాలక్రమంలో పరిణామం చెందిందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.